ఖమ్మం టీఆర్ఎస్‌లో భగభగలు.. ఆ ఎమ్మెల్యే‌ను టార్గెట్ చేసిన మాజీ మంత్రి?

అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ‘దళిత బంధు’ స్కీమ్‌ను హుజురాబాద్‌లో ప్రవేశపెట్టేందుకు ఈ నెల 16న ముహుర్తం ఖరారు చేసింది.ఈ స్కీమ్‌ను రాష్ట్రవ్యాప్తంగానూ ఇంప్లిమెంట్ చేసి తిరుగు లేని రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తోంది.

 Khammam In Trs Who Is The Former Minister Who Targeted That Mla-TeluguStop.com

అయితే, అధికార గులాబీ పార్టీలోనూ నేతల మధ్య విభేదాలున్నాయి.తాజాగా ఖమ్మం టీఆర్ఎస్‌లో విభేదాలు పీక్స్‌కు వెళ్లాయి.

అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ప్రస్తుతం తారాస్థాయికి చేరడంతో సదరు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు రెండు వర్గాలు వేర్వేరుగా చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

 Khammam In Trs Who Is The Former Minister Who Targeted That Mla-ఖమ్మం టీఆర్ఎస్‌లో భగభగలు.. ఆ ఎమ్మెల్యే‌ను టార్గెట్ చేసిన మాజీ మంత్రి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Kandala Upendar Reddy, Paleru, Telongana News, Tg Politics, Thummala Nageswara Rao, Trs, Trs Ktr-Telugu Political News

పాలేరు నియోజకవర్గంలో యాక్చువల్‌గా అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు.ఇక మారిన రాజకీయ పరిస్థితులు, పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే‌గా గెలుపొందిన కందాళ ఉపేందర్‌రెడ్డి గులాబీ గూటికి వచ్చారు.ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వర్గీయులు, మాజీ మంత్రి తుమ్మల వర్గీయుల మధ్య పొసగడం లేదు.

నియోజకవర్గంలోని మాజీ మంత్రి అనుచరులపైన ఎమ్మెల్యే కక్ష గట్టినట్లు, వారిపైన అక్రమ కేసులు పెడుతున్నట్లుగా మాజీ మంత్రి అనుచరులు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలోనే తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ అంశం తాజాగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఎమ్మెల్యే ప్రోద్బలంతో పోలీసులు మాజీ మంత్రి తుమ్మల అనుచరులైన తమపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని వారు చెప్తున్నారు.

ఇక ఈ విషయమై అవసరమైతే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కూడా ఫిర్యాదు చేయబోతున్నట్లు పాలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు.ఎమ్మెల్యే కందాళ అసలు టీఆర్ఎస్ నాయకులపైన కక్షపూరితంగా దాడులకు సిద్ధమవుతున్నారని ఆరోపిస్తున్నారు.

ఇలాగే దాడులు, కేసులు పెరిగితే తాము సహించబోమని స్పష్టం చేస్తున్నారు.మొత్తంగా చిలికి చిలికి గాలి వాన అయినట్లు ఈ విభేదాలు కాస్తా ఇంకా పెద్దవై అవకాశాలు మెండుగానే ఉన్నాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

#Tg Politics #TRS KTR #Paleru #KandalaUpendar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు