టిఆర్ఎస్ కి ఊహించని షాక్...కాంగ్రెస్ లోకి పోట్ల ?   Khammam District TRS Leader Looking Into Congress Party     2017-10-31   03:45:31  IST  Bhanu C

రేవంత్ రెడ్డి రాజీనామా వ్యవహారం అనూహ్యంగా పెను మార్పులకి దారితీస్తోంది..రేవంత్ వెనుక ఎవ్వరు వెళ్ళకుండా అడ్డుకట్ట వేయాలని అనుకున్న టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి షాక్ ల మీద షాక్ లు ఇవ్వడానికి పక్క ప్రణాళికతో ముందుకు వెళుతున్నాడు..బహుశా కేసీఆర్ కూడా ఇటువంటి పరిస్థితులని ఊహించరేమో. అసలు టిడిపి నాయకులు ఒక్కొక్కరుగా టిడిపి నుంచీ రేవంత్ వెంట వెళ్తారు అని భావించారు కానీ అనూహ్యంగా..ఇప్పుడు టీఆర్ఎస్ నాయకుల్ని కాంగ్రెస్ వైపు తీసుకువెళ్ళడానికి భారీ స్కెచ్ వేశాడు రేవంత్. ఇప్పటికే చాలా మంది టిడిపి నాయకులు కాంగ్రెస్ గూటికి వెళ్ళినా టిడిపిలో ఉండే అగ్రశ్రేణి నాయకులు మాత్రం మాంచి ముహూర్తం కోసం వేచి చూస్తున్నారని సమాచారం.

కాంగ్రెస్ లోకి పోట్ల నాగేశ్వరావు:

మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో రేవంత్ వేస్తున్న స్కెచ్ చాలా భారేగానే ఉన్నట్టుగా తెలుస్తోంది.టీఆరెస్ లో ఉంటూ అసంత్రుప్తిలో ఉన్న నాయకుల మీద దృష్టి సారించారు రేవంత్..అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్సీ ,టిఆర్ఎస్ నేత పోట్ల నాగేశ్వరావు కొడంగల్ లోని రేవంత్ నివాసంలో కలిశారు.పొట్ల ఖమ్మం జిల్లాలో ఉన్న బలమైన నేతల్లో ఒకరు..అక్కడ పార్టీ నాయకుడిగా మాత్రమే కాదు ప్రజల మనిషిగా..ఆయనకి మంచి పేరు ఉంది..పార్టీలు శాశ్వతం కావు మనకి ప్రజలు మాత్రమే ముఖ్యం అంటూ పదవి వున్నా లేకపోయినా ఆయన ప్రజలకి అందుబాటులో ఉంటూ ఉంటారు.ఖమ్మంలో ఎంతో పట్టు ఉన్న నేత కాబట్టే గతంలో టిడిపిలో ఉన్న పోట్లని కేసీఆర్ కావాలని టీఆరెస్ లోకి ఆహ్వానించారు..అంతేకాదు పోట్లకి తగ్గ గౌరవం పార్టీలో ఇస్తాము అని చెప్పి ఇప్పుడు పార్టీలో పట్టించుకోవడం లేదని..నన్ను నమ్ముకున్న ప్రజలకి ఏమి చేయలేకపోతున్నాను అని ఆయన తన సన్నిహితుల దగ్గర చర్చించినట్టుగా సమాచారం.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో 2009లో స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన పోట్ల 2015 వరకు టీడీపీ తరఫున కొనసాగారు.తరువాత రాజకీయ పరిణామాల నేపధ్యంలో టిఆర్ఎస్ లోకి వెళ్లారు.. టీడీపీలో సీనియర్‌ నాయకుడిగా, పలుసార్లు సుజాతనగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నేతగా..పార్టీలో రాష్ట్రస్థాయి పదవులు చేపట్టిన నేతగా పేరొందిన పోట్ల..తన ఇలాఖాలో తనకంటూ ఒక గుర్తింపుతో..బలమైన అనుచరగణంతో ఉండేవారు.అల్లాంటి నేతని టిఆరెస్ పార్టీ అశ్రద్ద చేయడంతో పాటు పార్టీలో తగిన సముచిత స్థానాన్ని ఇవ్వడంలేదని చాలా అసంతృప్తిగా ఉన్నారట అందుకే ..కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అనే విషయం తెలుస్తోంది. అయితే రేవంత్ ని కలిసిన తరువాత పొట్ల అదే రోజు సాయంత్రం కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిని కలిశారు. ఆమెతో రాజకీయ పరిస్థితులు, పార్టీ పరిస్థితుల గురించి, తన రాజకీయ భవిష్యత్‌ గురించి సమగ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి కనుక పోట్ల వచ్చే పక్షంలో..కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంత్రిపదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. ఈ మేరకు రేవంత్ కూడా మీ మంత్రి పదవి పై నాది హామీ అని పోట్లకి మాట ఇచ్చారని ఈ విషయంలో పొట్ల కూడా సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

టీఆరెస్ నష్టనివారణ చర్యలు

పొట్ల టిఆర్ఎస్ ని వీడుతున్నారు అనే వార్తలు వచ్చిన నేపధ్యంలో అధినాయకత్వం ఒక్కసారిగా ఉలిక్కి పడింది..పోట్లని బుజ్జగించవలసినడిగా..ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ ని రంగంలోకి దింపింది. అయితే పార్టీలోకి వచ్చాక తనకు ఎటువంటి ప్రాధాన్యత లభించడం లేదని, పార్టీలో చేరినప్పుడు గుర్తింపు ఇస్తామని చెప్పినా.. పట్టించుకోలేదని ఆయన మాట్లాడారని సమాచారం..ఈనెల 9న అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మహబూబాబాద్‌లో జరిగే గిరిజన సదస్సులో పాల్గొనే అవకాశం ఉంది. ఈలోపే పోట్ల కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

పోట్ల కనుక టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి జంప్ అయితే..ఖమ్మం లోఉన్న పోట్ల అనుచరులు కూడా వరుసగా కాంగ్రెస్ లోకి క్యూ కడుతారని సమాచారం.. పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరితే పార్టీ పరంగా జిల్లాస్థాయిలో చాలా నష్టపోతాం అనే భావన ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులని కలవర పెడుతోంది. అయితే ఇంకా ఈ విషయంలో ఒక నిర్ణయానికి రాలేదని..నా అనుచరులతో మాట్లాడిన తరువాతే ఒకలా నిర్ణయానికి రానున్నట్టుగా సమచారం..రెండు..మూడు రోజుల్లో ఖమ్మంలో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏది ఏమైనా పోట్ల టిఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లోకి వెళ్తే టిఆర్ఎస్ పార్టీకి భారే నష్టం అని విశ్లేషకుల అభిప్రాయం.