ఖమ్మం కార్పొరేషన్ ఆఫీస్ లోనే కాదు ఢిల్లీ లో కూడా అదే తంతు  

Dtc Bus Driver-conductor Suspended For Viral On Social Media -

నిన్న గాక మొన్న ఖమ్మం కార్పొరేషన్ లో ఉద్యోగుల టిక్ టాక్ వీడియో లు వివాదం రేపిన సంగతి తెలిసిందే.ఇంకా ఆ వివాదం పై చర్చ జరుగుతుండగానే ఢిల్లీ లో కూడా ఇలాంటి టిక్ టాక్ వీడియో ల వివాదం ఒకటి చోటుచేసుకుంది.

Dtc Bus Driver-conductor Suspended For Viral Videos On Social Media

బస్సు కండక్టర్, డ్రైవర్ ఓ యువతితో కలిసి డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఎంజాయ్ చేసి వారిద్దరూ ఇప్పుడు ఉద్యోగాలు కూడా కోల్పోయే పరిస్థితి ఎదురైంది.

వివరాల్లోకి వెళితే… గత నెలలో ఢిల్లీ జనక్‌పురి ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో ఓ యువతి డ్యాన్సులు చేసింది.ఆమె డ్యాన్స్ చేస్తుండగా.

ఖమ్మం కార్పొరేషన్ ఆఫీస్ లోనే కాదు ఢిల్లీ లో కూడా అదే తంతు-General-Telugu-Telugu Tollywood Photo Image

డ్రైవర్, మార్షల్స్ అక్కడే ఉన్నారు.బస్సులో సరదాగా వీడియోలు తీసిన ఆ యువతి ఇప్పుడు తాజాగా ఆ వీడియోలను సోషల్ మీడియా లో విడుదల చేయడం తో ఇప్పుడు అవి వైరల్ గా మారాయి.

దీనితో ఈ వ్యవహారం కాస్తా ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అధికారుల వరకు చేరడం తో ఇప్పుడు వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి.ఇప్పటికే ఆ ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చిన అధికారులు,బస్సు డ్రైవర్ ని సస్పెండ్ చేయగా, కండక్టర్ కు మాత్రం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.

మార్షల్ ను కూడా మందలించిన అధికారులు సివిల్ డిఫెన్స్ కార్యాలయానికి ఎటాచ్ చేసినట్లు తెలుస్తుంది.విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిపై చర్యలు తీసుకున్నారు అధికారులు.ఇలాంటి చర్యలతో డీటీసీ పరువుపోతుందని.ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.మొన్న ఖమ్మం కార్పొరేషన్ లో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే చోటుచేసుకోవడం తో వారంతా వేటుకు గురైన విషయం తెలిసిందే.ఈ టిక్ టాక్ లతో ఉద్యోగాలకే ఎసరు తెచ్చుకుంటున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dtc Bus Driver-conductor Suspended For Viral On Social Media- Related....