ఆ దేశంలో ప్రవాసులపై దాడి.. ఐదుగురికి గాయాలు.. ఇద్దరు అరెస్ట్!

ఆస్ట్రేలియా దేశంలో ఖలిస్తాన్, ప్రవాసుల మధ్య తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోంది.ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జనవరి 29న ఖలిస్తాన్ మద్దతుదారులు భారతీయులపై దాడికి పాల్పడ్డారు.

 Khalistani Supporters Attacking Indian Australians Viral Video Details, Nri News-TeluguStop.com

నిజానికి ఆస్ట్రేలియా దేశంలో గత కొద్ది కాలంగా ఖలిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక ఉద్యమాలు ముదురుతున్నాయి.అక్కడ భారతీయులను వ్యతిరేకించే ఉద్యమాలను ఎన్నారైలు అస్సలు సహించలేకపోతున్నారు.

అందుకే ఖలిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక ఉద్యమాలను నిరసిస్తూ రీసెంట్‌గా ఒక నిరసన చేపట్టారు.

ప్రవాసుల విద్యార్థులు ఆస్ట్రేలియా ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాత మెల్‌బోర్న్‌లోని ఫెడరేషన్ స్క్వేర్ సమీపంలో ఒక నిరసన చేపట్టారు.ఇదే సందర్భంగా ఖలిస్తాన్ ఏర్పాటుపై రెఫరెండం కూడా నిర్వహించాలని ప్లాన్ చేశారు.ఇందుకు ఎన్నారైలు భారత జాతీయ జెండాలు పట్టుకొని దీక్ష చేశారు.

సరిగ్గా ఇదే టైమ్‌లో ఖలిస్తాన్ మద్దతు దారులు మెల్‌బోర్న్‌లోని ఫెడరేషన్ స్క్వేర్ వద్దకు పోటెత్తారు.ఖలిస్తాన్ జెండాలు చేత పట్టుకొని వచ్చిన వారు ఇండియన్స్‌పై రాళ్లు రువ్వారు.

ఇది చాలాదన్నట్టు కత్తులతో బెదిరిస్తూ బీతావాహ వాతావరణాన్ని సృష్టించారు.భారత జాతీయ జెండా కర్రలను విరగ్గొట్టారు.

పరిస్థితి మరింత దారుణంగా మారకుండా ఆస్ట్రేలియా పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు.అలాగే ఈ ఘటనకు కారకులైన ఇద్దరిని అరెస్టు చేశారు.మరికొందరిపై కేసు నమోదు చేసి.జరిమానా కూడా విధించారు.ఈ దిగ్భ్రాంతికర సంఘటనలో ఐదుగురికి బాగా గాయాలయ్యాయి.ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనను తాజాగా బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిశ్రా ఖండించారు.దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇకపోతే ఖలిస్తాన్ ఉద్యమం అనేది పంజాబ్ ప్రాంతంలో ఖలిస్తాన్ అనే సిక్కుల కోసం ప్రత్యేక దేశాన్ని సృష్టించాలని సిక్కులు కోరుకుంటున్న ఒక ఉద్యమం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube