50 అడుగుల ఎత్తుతో ఖైరతాబాద్ మ‌హా గ‌ణ‌ప‌తి

భాగ్య‌న‌గ‌రంలో గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌తో ఖైర‌తాబాద్ మ‌హా గ‌ణ‌ప‌తి విగ్ర‌హ త‌యారీ కాస్త ఆల‌స్యం కానుంది.చ‌వితికి రెండు రోజుల ముందు మాత్ర‌మే ఈ సారి ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నాడు.

 Khairatabad Maha Ganpati With A Height Of 50 Feet-TeluguStop.com

ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ మహా గణపతి ప్రస్థానం.ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఏడాదికో అడుగు పెరుగుతూ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాడు.

ఈసారి 68 వ సంవత్సరం సందర్భంగా శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా 50 అడుగుల ఎత్తుతో భక్తులకు దర్శనమివ్వనున్నారు.ఈ క్రమంలో విగ్రహా తయారీ పనులను ఉత్సవ కమిటీ సభ్యులు ప్రారంభించారు.

శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో విగ్రహం రూపుదిద్దుకోనుండగా.పాముపై కమలం పువ్వులో నిలబడి ఉన్న మహా గణపతికి కుడివైపు లక్ష్మీదేవి, ఎడమ వైపు మూషికం ఉండనున్నాయి.

అదేవిధంగా ఐదు తలలపై పాము పడగ, ఆరు చేతులతో మహా గణపతి ఈ సారి భక్తులను దర్శనమిస్తారని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube