ముస్తాబవుతున్న ఖైరతాబాద్ గణేశుడు.. అసలు ఖైరతాబాద్ గణేశ్ ఎప్పుడు ,ఎలా మొదలయ్యింది..ఆసక్తికరమైన విషయాలు..  

Khairatabad Ganesh 2018 Making Is Ready-

Vinayaka Chavithi is the earliest known name of Khairatabad Ganesh. Every year he is impressed by the devotees in different forms. Not only the Bhagyankar Vasu, but also the different states for Khairatabad Ganeshudi's darshan. The famous celebrity Ganesha is 60 feet high in 2014. This time he is going to have 57 fits in the recordings of some interesting things about Khairatabad Ganesh ..

Statue of the idol ...

Bal Gangadhar Tilak started festivals and started uniting the unity of the jananti. To begin with the inspiration, Khairatabad Ganesha began with the inspiration of the ceremony dedicated to the celebration of the ceremony started by the then councilor Singari Shankarayya in 1954. After about 60 years each step is stepping down each step. At present we see a statue of 51 feet. One step to the end of the statue is made of yellow. .

In the first days of the day, the city was celebrated from 20 days to 20 days. In the year 1960, the elephant was immersed in Sagar. The 11 foot statue was constructed by a large number of people from all parts of the state. In Bhagyanagar Ganesh Festival Committee Khairatabad Festival Committee On days In 1982, together with two boats on the statue majjanam persuaded to take hussensagar were immersed in the center of the ..

Laddu specializes here ... Laddu from the beginning is not set up. In 2011, Sulichi Foods organizer Mallipabu handed over 500 kg of laddo to Ganapati in Tapeswarra near Kakinada. Last year, 6000 kg of laddo was made. In the last minute of this year, 500 kg of laddo was set up.

. More things ...

వినాయక చవితి అనగానే ముందుంగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేషుడు. ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఖైరతాబాద్ గణేషుడి దర్శనం కోసం కేవలం భాగ్యనగర్ వాసులే కాదు వివిధ రాష్ట్రాల వారు కూడా ఎదురుచూస్తుంటారు..

ముస్తాబవుతున్న ఖైరతాబాద్ గణేశుడు.. అసలు ఖైరతాబాద్ గణేశ్ ఎప్పుడు ,ఎలా మొదలయ్యింది..ఆసక్తికరమైన విషయాలు..-Khairatabad Ganesh 2018 Making Is Ready

అంతటి ప్రఖ్యాతి పొందిన గణేశుడు 2014లో 60 ఫీట్ల ఎత్తులో కొలువుదీరి రికార్డుల్లోకెక్కగా.ఈ సారి 57 ఫీట్లతో దర్శనమివ్వబోతున్నాడు.ఖైరతాబాద్ గణేశుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.

విగ్రహ విశిష్టత.

బాల గంగాధర తిలక్ ప్రజల్లో జాగృతి నింపి పోరాట బాట పట్టించుటకు, ఐక్యతకు వినాయకుని జయంతిని సమైక్యంగా నిర్వహించడం ప్రారంభించారు.ఆ స్పూర్తితో ప్రారంభయిందే ఖైరతాబాద్ గణేశ్…1954లో అప్పటి కౌన్సిలర్‌ సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాల ప్రతిష్ఠతో ప్రతిమ కూడా పెరుగుతూ వచ్చింది. అలా 60ఏళ్ల వరకు ఒక్కో అడుగు పెంచుతూ ఆ తర్వాత ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మనం 51 అడుగుల విగ్రహాన్ని చూస్తున్నాం.చివరికి చేసే ఒక్క అడుగు విగ్రహం మేలిమి పసుపుతో చేస్తారట….

తొలిరోజులు.

తొలి రోజుల్లో నగరమంతా వినాయకులను నిమజ్జనం చేసినా ఇక్కడ 20 నుంచి నెల రోజుల వరకు ఉత్సవాలు నిర్వహించేవారు.1960లోఏనుగుపై వూరేగిస్తూ సాగర్‌కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.ఇక్కడ 11 అడుగుల విగ్రహాన్ని తయారుచేసినప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.1982లో భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్‌ ఉత్సవ నిర్వాహకులను కలిసి 11 రోజులకే నిమజ్జనం చేసేలా ఒప్పించారు.1982లో రెండు పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌ మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు..

లడ్డూ ప్రత్యేకత.

ఇక్కడ మొదటి నుంచి లడ్డూ ఏర్పాటు చేయడం లేదు. 2011లో కాకినాడ సమీపంలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్‌ నిర్వాహకుడు మల్లిబాబు 500 కిలోల లడ్డూను గణపతి చేతిలో ఉంచారు.గతేడాది 6వేల కిలోల లడ్డును చేతిలో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది చివరి నిమిషంలో 500 కిలోల లడ్డూను ఏర్పాటు చేశారు..

మరిన్ని విషయాలు.

1983లో సినిమాల్లోనూ ఖైరతాబాద్‌ వినాయకుడు వెలుగువెలిగాడు. కళాతపస్వి కె..

విశ్వనాథ్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘సాగర సంగమం’ చిత్రం షూటింగ్‌ కోసం నటుడు కమలహాసన్‌తో ఒక రోజంతా చిత్రీకరణలో పాల్గొన్నారు.ఎన్టీఆర్‌, శోభన్‌బాబుఅప్పట్లో గణపతిని దర్శించుకున్నారు.తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రన్‌తో పాటు దాదాపు 150 మంది కళాకారులు మూడు నెలల పాటు బృందాలుగా పనిచేసి వినాయకుడికి రూపకల్పన చేస్తారు.