మళ్ళీ అదే తప్పు చేస్తున్న మెగాస్టార్?

మెగాస్టార్ చిరంజీవి తన స్టార్ ఇమేజ్ కి సామాజిక సందేశం తోడవ్వాలని కోరుకుంటారు.అందుకే ఠాగూర్, స్టాలీన్, శంకర్ దాదా జిందాబాద్ లాంటి సినిమాలు వచ్చాయి.

 Khaidi No.150 : Will Chiranjeevi Stand Honest On Murugadoss Story?-TeluguStop.com

సామాజిక అంశాలను తాకే సినిమా కావాలి కాబట్టే తన 150వ సినిమాకి ఎన్నో కొత్తకథలు వద్దని, తమిళ కత్తి చిత్రాన్ని “ఖైది నం150” పేరుతో రిమేక్ చేస్తున్నారు.కాని చేసిన తప్పే మెగాస్టార్ మళ్ళీ చేస్తాడని భయపడుతున్నారు మెగాఫ్యాన్స్.

ఠాగూర్ సినిమా మురుగదాస్ తీసిన ఓ తమిళ చిత్రానికి రిమేక్ అన్న సంగతి తెలిసిందే.నిజానికి ఈ సినిమాని తెలుగులో కూడా మురుగదాస్ డైరెక్ట్ చేయాల్సి ఉంటే, చిరంజీవి తన “స్టార్ ఇమేజ్” కోసం ఆ సినిమా క్లయిమాక్స్ మార్చమంటే ఇష్టంలేక మురుగదాస్ ఆ సినిమా వదిలేస్తే అది కాస్త వినాయక్ చేతిలో పడిందని చెబుతూ ఉంటారు ఫిలింనగర్ జనాలు.

ఇక స్టాలీన్ సమయంలో కూడా చిరంజీవి “స్టార్ ఇమేజ్” మార్పులు నచ్చకే మురుగదాస్ ప్రాజెక్టుని వదిలేసి వెళ్ళిపోతే ఆ సినిమాని కూడా తరువాత వివి వినాయక్ హ్యాండిల్ చేసారని అప్పట్లో చెప్పుకునేవారు.అయితే, ఇది ఎంతవరకు నిజం అనేది పూర్తిగా తెలియదు.

ఇప్పుడు మళ్ళీ అదే మురుగదాస్ తీసిన కత్తి చిత్రాన్ని వినాయక్ దర్శకత్వంలో రిమేక్ చేస్తున్నారు మెగాస్టార్.కత్తి చిత్రానికి విజయ్ ఇమేజ్ మీద కాకుండా సినిమా థీమ్ మీద ప్రమోషన్స్ చేసారు మురుగదాస్.కాని ఖైది నెం.150 ఫస్ట్ లుక్ లో, మోషన్ పోస్టర్ లో “బాస్ ఈజ్ బ్యాక్” ట్యాగ్ లైన్ తో మళ్ళీ చిరంజీవి ఇమేజ్ మీద ధ్యాస పెట్టారు తప్పితే సినిమా థీమ్ ని జనాలకి చెప్పడానికి మాత్రం ప్రయత్నించలేదు.

ఇదే ఇమేజ్ ధ్యాసలో స్టాలీన్ విఫలమైంది.మరి కత్తిలో తన ఇమేజ్ ని పక్కనపెట్టి నటించిన విజయ్ లాగా మెప్పిస్తారో లేక ఇమేజ్ ధ్యాసలో చేసిన తప్పునే మళ్ళీ చేస్తారో మన మెగాస్టార్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube