అక్కడ ఖైదీ నం 150 డిస్ట్రిబ్యూటర్ కి చెమటలు పడుతున్నాయి     2017-01-12   23:32:39  IST  Raghu V

యూఎస్ ప్రీమియర్స్ లో 1.2 మిలియన్ల డాలర్లు దాటగానే తెగ సంబరపడిపోయారు మెగా అభిమానులు. ఇది మెగాస్టార్ స్టామినా అంటూ జబ్బలు చరుచుకున్నారు. కాని అభిమానులందరు ఢీలా పడేలా, ముఖ్యంగా పంపిణీదారులకి చెమటలు పట్టేలా, ప్రీమియర్స్ తరువాత అసలు కథ మొదలైంది.

ఖైదీనం 150 బుధవారం (యూఎస్ లో ప్రీమియర్స్ తరువాతి రోజు) ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? $157 .. అంటే లక్ష యాభై ఏడు వేల డాలర్లు. పన్నెండు లక్షల డాలర్ల నుంచి ఒక్కసారిగా లక్ష యాభైకి పడిపోయింది సినిమా. మూడొవరోజు కూడా ఏమంత గొప్పగా మొదలవ్వలేదు. ఖైదీ కన్నా మెరుగ్గా గౌతమీపుత్ర శాతకర్ణి గురువారాన్ని మొదలుపెట్టింది. (అమెరికా కాలమానం ప్రకారం).

ఖైదీ నం 150 అమెరికాలో కనీసం 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే తప్ప, అక్కడి పంపిణీదారులకి నిద్రపట్టదు. ఈ ట్రెండ్ చూస్తోంటే, ఓవర్సీస్ లో ఈ సినిమాకి కష్టాలు తప్పేలా లేవు. మరోవైపు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ప్రాంతాల్లో మాత్రం చిరంజీవి ఇమేజ్ తో సినిమా మంచి స్పీడ్ మీద ఉంది. భారతదేశంలో మెగాస్టార్ ఛరిష్మా బాగా పనిచేస్తోంది.