కేజీఎఫ్ 2 మూవీ స్టోరీ ఇదేనా.. క్లైమాక్స్ లో షాకింగ్ ట్విస్ట్..?

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఇతర భాషల్లో, తెలుగులో కేజీఎఫ్ ఛాప్టర్1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.కేజీఎఫ్ ఛాప్టర్ 1 హిట్ కావడంతో కేజీఎఫ్ ఛాప్టర్2 పై కూడా ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 Raveena Tandon To Play Prime Minister Role In Kgf2 Movie, Kgf2 Movie Story, Kgf2-TeluguStop.com

యశ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలు కేజీఎఫ్ ఛాప్టర్1లో ఎక్కువగా ఉన్నాయి.కేజీఎఫ్ ఛాప్టర్1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగుతో పాటు ఇతర భాషల హీరోలు సైతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే కేజీఎఫ్2 స్టోరీకి సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.కేజీఎఫ్ లో రాఖీభాయ్ గరుడను చంపిన తరువాత తనను రాజుగా ప్రకటించుకుంటారు.ఆ తరువాత రాఖీభాయ్ అధీరాతో పోరాడాల్సి వస్తుంది.అధీరాతో జరిగిన పోరాటంలో కూడా రాఖీభాయ్ విజయం సాధిస్తారు, మకుటం లేని మహారాజుగా ఉన్న రాఖీభాయ్ కు దేశ ప్రధాని రూపంలో సమస్య ఎదురవుతుంది.

Telugu Climax, Prashant Neel, Yash, Kgf, Kgf Story, Pan India, Rakhi Bhai, Ravee

రవీనా టాండన్ దేశ ప్రధాని పాత్రను పోషిస్తుండగా ప్రధాని రాఖీభాయ్ సామ్రాజ్యంపై దండెత్తడంతో పాటు క్లైమాక్స్ లో రాఖీభాయ్ పాత్ర చనిపోతుందని తెలుస్తోంది.క్లైమాక్స్ లో హీరో చనిపోయినా దర్శకుడు ఈ పాత్ర విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని అందువల్ల ప్రేక్షకులకు క్లైమాక్స్ సైతం నచ్చుతుందని తెలుస్తోంది.మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కు రెండు వారాల ముందు కేజీఎఫ్ ఛాప్టర్2 రిలీజ్ కానుంది.

ఈ సినిమా రికార్డుస్థాయిలో కలెక్షన్లను సాధించడంతో పాటు యశ్ మార్కెట్ ను మరింత పెంచుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కేజీఎఫ్ ఛాప్టర్2 కూడా హిట్టైతే యశ్ భవిష్యత్తు సినిమాలకు కూడా భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube