రజినీని కొట్టే సత్తా ఆ హీరోకు ఉందా?

టాలీవుడ్‌లో తెలుగు సినిమాలకు ఎంత ఆదరణ ఉంటుందో డబ్బింగ్ సినిమాలకు కూడా అంతే ఆదరణ ఉంటుంది.ముఖ్యంగా తమిళ స్టార్ హీరోలు నటించే చిత్రాలను తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేస్తుంటారు.

 Kgf To Beat Robo Movie Trp, Kgf, Yash, Robo, Trp, Rajinikanth-TeluguStop.com

ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఆల్‌టైమ్ రికార్డులను క్రియేట్ చేసి సెన్సేషన్ కూడా క్రియేట్ చేశాయి.ఇక తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించే సినిమాలకు ప్రేక్షకులు పట్టం కడుతుంటారు.

అయితే ఇప్పుడు రజినీకాంత్ క్రియేట్ చేసిన ఓ అరుదైన రికార్డును బద్దలుకొట్టేందుకు మరో డబ్బింగ్ చిత్రం ప్రయత్నం చేసింది.

గతంలో స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన రోబో చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్‌గా నిలిచింది.

ఆ సినిమాకు బుల్లితెర ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు.దీంతో ఈ సినిమా డబ్బింగ్ చిత్రాల్లో అత్యధిక టీఆర్పీ రేటింగ్‌న దక్కించుకుంది.ఏకంగా 19.04 టీఆర్పీతో రోబో సినిమా టాప్ ప్లేస్‌లో నిలిచింది.డబ్బింగ్ చిత్రాలు ఎన్ని రిలీజ్ అయినా ఇప్పటి వరకు రోబో టీఆర్పీని దాటలేకపోయాయి.అయితే కన్నడ చిత్రంగా వచ్చిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమాను ఇటీవల బుల్లితెరపై టెలికాస్ట్ చేశారు.దీంతో ఈ సినిమాకు భారీ ఎత్తున వ్యూవర్‌షిప్‌ను దక్కించుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

మరి రజినీకాంత్ క్రియేట్ చేసిన రికార్డును యష్ నిజంగానే బద్దలు కొడతాడా లేడా అనేది చూడాలి.ఏదేమైనా తొమిదేళ్ల రికార్డును బద్దలుకొట్టడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

ఇక కేజీఎఫ్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వచ్చింది.ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ను చిత్ర యూనిత్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube