కేజీఎఫ్ హీరో వాడే ఈ కారు ఖరీదెంతో తెలిస్తే మాత్రం కచ్చితంగా షాకవ్వాల్సిందే!

కేజిఎఫ్( KGF ) హీరో యష్‌( Yash ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యష్‌ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా కేజిఎఫ్.

 Kgf Star Yash Spotted In 1 5 Crore Toyota Vellfire Luxury Car Details, Kgf, Yash-TeluguStop.com

ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ కావడంతో పాటు భారీగా కలెక్షన్లను కూడా సాధించింది.

ఈ మూవీతో యష్ క్రేజ్, రేంజ్ రెండు మారిపోయాయి.యష్ అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ కేజీఎఫ్ హీరో అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు.

ఆ రేంజ్ లో ఈ సినిమా యష్ కి గుర్తింపు తెచ్చి పెట్టింది.

Telugu Kgf Yash, Kgf, Kollywood, Luxury Car, Radhika Pandit, Toyota Car, Yash, Y

ఇకపోతే కార్లు అంటే పిచ్చి అన్న విషయం మనందరికీ తెలిసిందే.లగ్జరీ కార్లు అంటే ఇంకా ఇష్టం.యష్ వద్ద కోట్లు విలువ చేసే ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.

ఇటీవల ఆయన తన భార్య రాధికా పండిట్‌( Radhika Pandit ) తో కలిసి ఒక విలాసవంతమైన కారులో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.స్టైలిష్ లుక్‌ తో, కూల్ హావభావాలతో కారు నుంచి దిగుతున్న వీడియో వైరల్‌ అవుతోంది.

యష్ ప్రయాణించిన కారు టయోటా వెల్‌ఫైర్.( Toyota Vellfire ) ఈ మోడల్ భారత మార్కెట్లో హై, వీఐపీ ఎగ్జిక్యూటివ్ లాంజ్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి ఉంది.

Telugu Kgf Yash, Kgf, Kollywood, Luxury Car, Radhika Pandit, Toyota Car, Yash, Y

ఈ కారు హై వేరియంట్ రూ.1.39 కోట్లు, కాగా వీఐపీ ఎగ్జిక్యూటివ్ లాంజ్ వేరియంట్ ధర రూ.1.51 కోట్లుగా ఉంటుంది.టయోటా వెల్‌ఫైర్ మైలేజ్ విషయానికి వస్తే.ఇది ఒక లీటరుకు ARAI- సర్టిఫైడ్ ప్రకారం 16.35 కి.మీ మైలేజ్ అందిస్తుందట.టయోటా వెల్‌ఫైర్ బరువు 2815 కేజీల వరకు ఉండి చాలా పెద్దదిగా ఉంటుందట.

అలాగే ఇందులో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ కారు ధర తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.

ఒక్క కార్ విలువ అన్ని కోట్లా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube