కేజీఎఫ్ సినిమా 90 శాతం షూటింగ్ ఫినిష్ అయిపోయిందా  

90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న కేజీఎఫ్.

Kgf Sequel Movie 90 Percent Shooting Was Finished-bollywood,hero Yash,kannada Cinema,kgf Sequel Movie,kollywood,tollywood

సౌత్ ఇండియాలో బాహుబలి సినిమా తర్వాత ఆ రేంజ్ లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం కేజీఎఫ్. కన్నడలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు ఏడు భాషలలో రిలీజ్ అయ్యి అన్ని చోట్ల సత్తా చాటింది. ఇక హిందీ, తెలుగులో అయితే ఇది వరకు ఎన్నడు లేని విధంగా ఓ కన్నడ సినిమా అత్యధిక కలెక్షన్ తో ట్రెండ్ సృష్టించింది..

కేజీఎఫ్ సినిమా 90 శాతం షూటింగ్ ఫినిష్ అయిపోయిందా -KGF Sequel Movie 90 Percent Shooting Was Finished

ఇందులో హీరోగా చేసిన కన్నడ రాకింగ్ స్టార్ యష్ కి ఇప్పుడు ప్రభాస్ లాగే దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక కేజీఎఫ్ సీక్వెల్ ని ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 90 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుంది. క్లైమాక్స్ మినహా మిగిలిన భాగం పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఇక దేశ వ్యాప్తంగా సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉండటంతో సినిమా మీద మొదటి భాగం కంటే ఎక్కువ బడ్జెట్ నిర్మాతలు పెట్టినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఏడాదిలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని దర్శకుడు ప్రశాంత్ ఉన్నట్లు తెలుస్తుంది.

మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఎ స్థాయిలో రికార్డ్స్ సృష్టిస్తుందో వేచి చూడాలి.