అప్పటి వరకు ప్రశాంత్‌ నీల్‌ ఖాళీగానే ఉంటాడా?  

Kgf Prasanth Nel Ntr Trivikram - Telugu Aravinda Sametha, Kgf, Kgf 2, Ntr, Ntr Birth Day, Prasanth Nel, Trivikram

కేజీఎఫ్‌ చిత్రంతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా క్రేజ్‌ను దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.ఆ చిత్రంతో కన్నడ సినిమా చరిత్రలో గతంలో ఎప్పుడు లేని వసూళ్లను నమోదు చేశాడు.

 Kgf Prasanth Nel Ntr Trivikram

అద్బుతమైన రికార్డులను సొంతం చేసుకున్న ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం కేజీఎఫ్‌ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాను ఈ ఏడాది చివర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.

కేజీఎఫ్‌ 2 చిత్రం తర్వాత ప్రశాంత్‌ నీల్‌ చేయబోతున్న చిత్రం ఎన్టీఆర్‌తో అంటూ దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది.నిన్న ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్బంగా ఎప్పుడు లేనిది ప్రశాంత్‌ నీల్‌ ట్వీట్‌ చేసి మరీ శుభాకాంక్షలు తెలియజేశాడు.

అప్పటి వరకు ప్రశాంత్‌ నీల్‌ ఖాళీగానే ఉంటాడా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దాంతో ఖచ్చితంగా ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఉంటుందనే వార్తలు కాస్త అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ తరహాలో అయ్యింది.ఇద్దరి కాంబోలో మూవీ ఖచ్చితంగా రాబోతుంది అని క్లారిటీ వచ్చేసింది.

మూవీ అయితే క్లారిటీ వచ్చేసింది కాని అది ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేదు.ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు.ఆ తర్వాత ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ మూవీ పట్టాలెక్కబోతుంది.ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యేందుకు కనీసం ఏడాదిన్నర అయ్యే అవకాశం ఉంది.

వచ్చే ఏడాది చివరి వరకు ఎన్టీఆర్‌ ఈ రెండు సినిమాలతోనే బిజీగా ఉంటాడు.కనుక 2022 ఆరంభంలో ప్రశాంత్‌కు ఎన్టీఆర్‌ డేట్లు ఇస్తాడు.

మరి అప్పటి వరకు ప్రశాంత్‌ నీల్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ చేసుకుంటూనే ఉంటాడా లేదంటే మరేదైనా ప్రాజెక్ట్‌ను మొదలు పెడతాడా అనేది తెలియాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు