ఒక్కపూట తిండి కోసం కిడ్నీ అమ్మాలనుకున్న కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్.. ఆ తర్వాత?

కేజీఎఫ్, కేజీఎఫ్2( KGF, KGF2 ) సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకోవడానికి ప్రశాంత్ నీల్ ( Prashanth Neil )ఎంత కారణమో ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన రవి బస్రూర్ ( Ravi Basrur )మ్యూజిక్, బీజీఎం కూడా అంతే కారణమని చెప్పవచ్చు.కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవి బస్రూర్ కు తెలుగు రాష్ట్రాల్లో సైతం ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉంది.

 Kgf Music  Director Career Troubles  Goes Viral In Social Media  Details Here ,-TeluguStop.com

కర్ణాటక రాష్ట్రంలోని కుందాపూర్ లో రవి జన్మించారు.

రవి బస్రూర్ పలు సినిమాలకు గీత రచయితగా కూడా పని చేశారు.

ఒక్కపూట తిండి కోసం రవి బస్రూర్ కెరీర్ తొలినాళ్లలో కిడ్నీ అమ్మాలని అనుకున్నారు.ఈ డైరెక్టర్ అనుభవించిన కన్నీటి కష్టాల గురించి తెలిస్తే మాత్రం నిజంగా షాకవ్వాల్సిందేనని చెప్పవచ్చు.

రవి బస్రూర్ సినిమాల కోసం పని చేస్తున్నా తన నిజ జీవితంలో సినిమా కష్టాలను అనుభవించారని చెప్పవచ్చు.రవి బస్రూర్ ఒకవైపు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు చిన్నచిన్న పనులు చేశారు.

Telugu Kgf Music, Kgf, Prashanth Neil, Ravi Basrur-Movie

పెద్దగా చదువుకోని రవి బస్రూర్ కు కెరీర్ తొలినాళ్లలో లక్ కూడా కలిసిరాలేదు.తాను రైలు టాయిలెట్ లో కూర్చుని ఏడ్చిన సందర్భాలు సైతం ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.తినడానికి తిండి లేకపోవడం, ఇంటి బాధ్యతలు నాపై పడటంతో కిడ్నీ అమ్మడానికి సిద్ధమయ్యానని రవి బస్రూర్ చెప్పుకొచ్చారు.ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఉగ్రమ్ మూవీ రవి బస్రూర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

Telugu Kgf Music, Kgf, Prashanth Neil, Ravi Basrur-Movie

ఈ సినిమా సక్సెస్ సాధించడంతో రవి బస్రూర్ కు కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల మ్యూజిక్, బీజీఎం ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుందని సమాచారం అందుతోంది.రవి బస్రూర్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube