ఈ టైంలో కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ సంపాదన 35 రూపాయిలు  

Kgf Music Composer Helps His Father Earn Rs 35 - Telugu Hero Yash,, Kgf Sequel, Pan India Movie, Tollywood

కరోనాతో అన్ని భాషలలో సినిమాలు షూటింగ్ బంద్ అయిపోయాయి.అలాగే సినిమాలకి సంబంధించిన వర్క్స్ కూడా ఆగిపోయి నటుల నుంచి, సాంకేతిక నిపుణులు వరకు అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు.

 Kgf Music Composer Helps His Father Earn Rs 35

ఇలాంటి టైంలో సెలబ్రిటీలు ఎవరికీ తోచిన పనిలో వాళ్ళు ఇంట్లో ఖాళీ సమయాన్ని గడుపుతున్నారు.అలాగే కేజీఎఫ్ సినిమాకి సంగీతం అందించి ఒక్కసారిగా దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్న సంగీత దర్శకుడు రవి బస్సూర్.

కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ మ్యూజిక్ దర్శకుడు కేజీఎఫ్ తో ఒక్కసారిగా స్టార్ గా మారిపోయాడు.ఇప్పుడు రవి కేజీఎఫ్ సీక్వెల్ కి మ్యూజిక్ అందించే పనిలో ఉన్నారు.

ఈ టైంలో కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ సంపాదన 35 రూపాయిలు-Movie-Telugu Tollywood Photo Image

దాంతో పాటు కన్నడలో పెద్ద హీరోల సినిమాలు చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే లాక్ డౌన్ నేపధ్యంలో రవి బస్సూర్ తన సొంత ఊరు ఉడిపి సమీపంలో కుందాపూర్ వెళ్ళిపోయాడు.

అక్కడ తన తండ్రితో పాటుగా దేవుళ్ళకు ఆభరణాలు తయారుచేసే పనిలో నిమగ్నమయ్యాడు.తండ్రికి సాయం చేస్తూ దేవుళ్ళ ఆభరణాలు తయారు చేస్తున్నాడు.ఇందుకు గాను అతనికి రోజుకి 35 రూపాయల సంపాదన వస్తుందట.కెజిఎఫ్ లాంటి సూపర్ హిట్ సినిమా తీసి కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకున్నా ఇలా తండ్రికి సాయపడుతూ 35 రూపాయలు సంపాదించడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు రవి బస్రూర్.

తాను చేస్తున్న ఈ పనిని వీడియో తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.తనకు మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాడు రవి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kgf Music Composer Helps His Father Earn Rs 35 Related Telugu News,Photos/Pics,Images..