కేజీఎఫ్ ని పట్టాలెక్కిస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్! సెకండ్ వీక్ లో సెట్స్ పైకి!

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న సినిమాగా రికార్డ్స్ తిరగరాసిన సినిమా కేజీఎఫ్.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిందీ, తెలుగు భాషలలో కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని రాకింగ్ స్టార్ క్రిష్ ని ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో ఆల్ ఇండియా స్థాయిలో క్రేజీ హీరోగా నిలబెట్టింది.

 Kgf Movie Sequel Started Will Be Soon-TeluguStop.com

ఇక కన్నడ ఇండస్ట్రీ సినిమాని కూడా సౌత్ ఇండియాలో టాప్ లో కేజీఎఫ్ నిలబెట్టింది.దీనికి సీక్వెల్ ని కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా వుంటే ప్రశాంత్ నీల్ ఇమేజ్ ని నేషనల్ స్థాయిలో పెంచిన ఈ సినిమాకి సీక్వెల్ ని మరింత గ్రాండ్ గా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు.భారీ బడ్జెట్ తో బాలీవుడ్ స్టార్ కాస్టింగ్ ని ఈ సినిమా కోసం దర్శకుడు ఇప్పటికే ఫైనల్ చేసాడు.

ఇక ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ ని దర్శకుడు ఫినిష్ చేసినట్లు తెలుస్తుంది.త్వరలో అధికారికంగా ఈ సినిమా షూటింగ్ ని ప్రశాంత్ నీల్ స్టార్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

అన్ని అనుకూలంగా జరిగితే మరో రెండు వారాలలో ఈ సినిమా అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం వుందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube