కేజీఎఫ్2 కంటే ఆ సినిమానే చాలా బాగుందట.. ఫ్యాన్స్ ఏం చెబుతున్నారంటే?

ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా దేశమంతటా కేజీఎఫ్2 సినిమా హవా నడుస్తోంది.అన్ని రాష్ట్రాల్లో కేజీఎఫ్2 సినిమాకు బుకింగ్స్ బాగున్నాయి.

 Kgf Movie Best Compared To Kgf2 Movie Details, Kgf Chapter 1, Kgf Chapter 2, Kgf-TeluguStop.com

తమిళనాడు రాష్ట్రంలో కేజీఎఫ్2 సినిమాకు అర్ధరాత్రి సమయంలో కూడా షోలు ప్రదర్శిస్తున్నారంటే ఈ సినిమాకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందనే ప్రశ్నకు సులభంగానే సమాధానం దొరుకుతుంది.ఈ సినిమాకు కొన్ని రివ్యూలు నెగిటివ్ గానే వచ్చినా ప్రేక్షకులు మాత్రం వాటిని పట్టించుకోలేదు.

కేజీఎఫ్2 సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులలో దర్శనమిస్తున్నాయి.కేజీఎఫ్ ఛాప్టర్2 చాలామంది అభిమానులకు నచ్చింది.

అయితే కేజీఎఫ్2 మూవీ చూసిన వాళ్లలో చాలామంది ఈ సినిమా కంటే కేజీఎఫ్ ఛాప్టర్1 బాగుందని చెబుతున్నారు.కథ, కథనం విషయంలో మాత్రం కేజీఎఫ్2 సినిమాతో పోల్చి చూస్తే కేజీఎఫ్1 పైచేయి సాధిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కేజీఎఫ్1 సినిమాలో సామాన్యుడు హీరోగా ఎదుగుతాడు కాబట్టి కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు కాబట్టి ఈ కథ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందని కేజీఎఫ్2 సినిమాలో భారీతనం ఉన్నప్పటికీ సినిమాలో అంత కిక్ లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Block Buster, Prasanth Neel, Foreign, Yash, Kgf Kgf, Kgf Chapter, Kgf, Ro

వీకెండ్ తర్వాత కలెక్షన్లను బట్టి కేజీఎఫ్2 సినిమా తుది ఫలితం గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

మరోవైపు కేజీఎఫ్ ఫ్యాన్స్ మాత్రం కేజీఎఫ్3 సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కేజీఎఫ్3 సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది.ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో క్లారిటీ రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.కేజీఎఫ్3 షూటింగ్ విదేశాలలో జరగనుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.మూడేళ్లలో యశ్ విదేశాల్లో ఏం చేశాడనే కథ, కథనాలతో ఈ సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube