మహేష్‌కు ఎసరుపెట్టిన కన్నడ హీరో  

KGF To Break Mahesh Babu Records On TV, KGF, Mahesh Babu, Yash, Sarileru Neekevvaru, TRP - Telugu Kgf, Mahesh Babu, Sarileru Neekevvaru, Trp, Yash

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాతో మహేష్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో భారీ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

 Kgf Mahesh Babu Yash

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేయగా మహేష్ యాక్టింగ్, విజయశాంతి కమ్‌బ్యాక్ ఈ సినిమా సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించాయి.

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా అదిరిపోయే హిట్‌గా నిలిచింది.ఈ సినిమాకు ఏకంగా 23.04 టీఆర్పీ రేటింగ్ రావడంతో టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది.ఈ సినిమా తరువాత బాహుబలి చిత్రం 22.7 టీఆర్పీతో రెండో స్థానంలో నిలిచింది.అయితే ఇప్పుడు ఈ రికార్డులన్నింటిని పాతర వేసేందుకు కన్నడ చిత్రం కేజీఎఫ్ రెడీ అయ్యింది.రిలీజ్ అయిన ఏడాదిన్నర తరువాత టీవీలో ప్రసారమవుతున్న కేజీఎఫ్ చిత్రం కోసం తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మహేష్‌కు ఎసరుపెట్టిన కన్నడ హీరో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

జూలై 5 ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మా ఛానల్‌లో కేజీఎఫ్ చిత్రం ప్రసారమవుతుండటంతో ఈ సినిమాకు అదిరిపోయే టీఆర్పీ రావడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.అంటే మహేష్ బాబు రికార్డును యశ్ పటాపంచలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.మరి మహేష్ బాబు రికార్డును కన్నడ హీరో బద్దలు కొడతాడా లేదా అనేది రేపు తేలిపోతుంది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

#Yash #TRP #KGF #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kgf Mahesh Babu Yash Related Telugu News,Photos/Pics,Images..