కొడుకు కు నామకరణం చేసిన యష్... మరి పేరు ఏంటంటే...?!

కేజిఎఫ్.ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

 Kgf Movie Hero Yash Son Naming Ceremony, Yatharv, Yash Son Name, Kgf2 Movie Shoo-TeluguStop.com

సినిమా రిలీజ్ అయిన ప్రతి భాషలోనూ భారీ హిట్ సాధించిన చిత్రం కేజిఎఫ్.ఈ సినిమాలో హీరోగా నటించిన కన్నడ స్టార్ హీరో యష్ ఓవర్ నైట్ లో దేశానికి మొత్తం కన్నడ సినిమా పవర్ ఏంటో చూపించాడు.తన నటనతో ఎంతోమంది అభిమానులను ఇట్టే సాధించుకున్నాడు యష్.కేజిఎఫ్ సినిమా తో తన పేరును అమాంతం దేశమంతా మార్మోగిపోయింది.

ఇక అసలు విషయంలోకి వెళితే.తాజాగా కన్నడ స్టార్ యష్ ఇంట్లో తన కుమారుని నామకరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.యష్, రాధిక కు ఇదివరకే ఒక పాప ఉండగా తాజాగా వారికి అబ్బాయి రెండో సంతానంగా పుట్టాడు.ఇక వీరిద్దరి పేర్లు కలిసి వచ్చే విధంగా తన కొడుకు కి “య‌ధ‌ర్వ్” అని పేరును నామకరణం చేశారు.

ఈ కార్యక్రమానికి సంబంధించి హీరో యష్ తన అభిమానుల కోసం సోషల్ మీడియా వేదికగా ఆ కార్యక్రమం సంబంధించి ఓ వీడియోను విడుదల చేశాడు.ఇక ఆ వీడియోలో పచ్చని తోట మధ్యప్రాంతంలో పూల పందిరి వేసి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇక ఆ కార్యక్రమంలో భార్య భర్తలు ఇద్దరు తన కొడుకును, కూతురును ఎత్తుకొని తీసుకువచ్చారు.ఇక ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తండ్రి కొడుకులు ఇద్దరు పంచె కట్టుకొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో ఈ కార్యక్రమం జరిగింది.

అయితే ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ నేపథ్యంలో కేవలం కొంతమంది అతిథుల మధ్య మాత్రమే ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు.గత కొంత కాలం నుండి కేజిఎఫ్ 2 చిత్ర నిర్మాణం నిలిచిపోవడంతో తన కొడుకుతో ఆడుకుంటున్న సమయంలో తీసిన వీడియోలను యష్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానుల కొరకు షేర్ చేస్తూనే ఉన్నారు.ఇకపోతే ప్రస్తుతం కేజిఎఫ్ 2 సినిమాకు సంబంధించి చిత్రీకరణ చివరి దశలో కొనసాగుతోంది.

కేజిఎఫ్ సినిమా లాగే కేజిఎఫ్ 2 కూడా పాన్ ఇండియా సినిమా లాగా తెరకెక్కుతున్న సంగతి అందరికీ విదితమే.ఇక ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

అలాగే ఈ సినిమా దసరా పండుగకు కానుకగా అక్టోబర్ 23న థియేటర్స్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube