ఆ హీరో దేవుడు.. కేజీఎఫ్ హీరో సంచలన వ్యాఖ్యలు..?

శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న యశ్ కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ ను సంపాదించుకున్నారు.కేజీఎఫ్ ఛాప్టర్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది.

 Kgf Hero Yash Sensational Comments About Rajinikanth And Kamal Hassan, Kamal Has-TeluguStop.com

కేజీఎఫ్ ఛాప్టర్ 2 పై భారీగా అంచనాలు ఏర్పడగా ఈ సినిమా కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే తాజాగా కేజీఎఫ్ హీరో యశ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోలీవుడ్ స్టార్ హీరోలైన రజనీకాంత్, కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

స్టార్ హీరో రజనీకాంత్ దేవుడు అని యశ్ అన్నారు.కమల్ హాసన్ గారి నటనను యశ్ ఏకంగా భగవద్గీతతో పోల్చారు.బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ గురించి మాట్లాడుతూ షారుఖ్ ఖాన్ అపర మేధావి అని యశ్ పేర్కొన్నారు.సాధారణంగా ఒక స్టార్ హీరో స్థాయిలో ఉన్న వ్యక్తి మరో స్టార్ హీరోను పొగడటం అరుదుగా జరుగుతుంది.

యశ్ మాత్రం ఇతర ఇండస్ట్రీలలోని స్టార్ హీరోలను ప్రశంసిస్తూ కామెంట్లు చేయడం గమనార్హం.

ఇతర ఇండస్ట్రీల స్టార్ హీరోలపై తనకు ఉన్నా అభిమానాన్ని యశ్ ఈ విధంగా చాటుకున్నారు.

యశ్ రజనీ, కమల్, షరుఖ్ ల గురించి గొప్పగా చెప్పడంతో ఆయా హీరోల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకుని కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నా యశ్ మాత్రం ఒదిగి ఉండటం గమనార్హం.

కేజీఎఫ్ ఛాప్టర్ 1 బ్లాక్ బస్టర్ కావడంతో దేశంలోని చాలామంది ప్రేక్షకులు కేజీఎఫ్ ఛాప్టర్ 2 కోసం ఎదురు చూస్తున్నారు.

Telugu Kamal Hassan, Kgf, Rajinikanth, Yash-Movie

యశ్ కు బాలీవుడ్ లో ఎవరితో నటించాలని ఉందనే ప్రశ్న ఎదురు కాగా ఆ ప్రశ్నకు యశ్ నవాజుద్దీన్ సిద్దిఖీ పేరు సమాధానంగా ఇచ్చారు.మరోవైపు కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది.ఈ ఏడాది జులై 16వ తేదీన కేజీఎఫ్ ఛాప్టర్ 2 రిలీజ్ కానుంది.

ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube