కేజీఎఫ్ అట్టర్‌ఫ్లాప్‌కు అసలు కారణం ఇదే!

కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి ఎలాంటి సక్సెస్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే.దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీకి కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

 Kgf Failed To Reach Expectations, Kgf, Yash, Prashanth Neel, Trp Rating, Tollywo-TeluguStop.com

దీంతో ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది.ఇక ఈ సినిమాను తెలుగునాట ఇటీవల టీవీలో ప్రసారం చేశారు.

అయితే ఈ సినిమాకు అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ వస్తుందని చిత్ర యూనిట్ భావించింది.కానీ ఈ సినిమాను స్టార్ మా ఛానల్ టెలికాస్ట్ చేయగా దీనికి కేవలం 11.9 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.ఈ లెక్కన ఈ సినిమా బుల్లితెరపై ఫ్లాప్‌గా నిలిచిందని చెప్పాలి.

అయితే ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను ఎందుకు ఆకట్టుకోలేదనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.అయితే 2018లో రిలీజ్ అయిన కేజీఎఫ్ 2019లో కూడా తన హవాను కొనసాగించింది.

కానీ ఈ సినిమాను 2020లో బుల్లితెరపై టెలికాస్ట్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఇప్పటికే పలు మాధ్యమాల్లో వీక్షించేశారు.ఇక ఈ సినిమాను చూడని వారు కూడా బుల్లితెరపై ప్రసారమయ్యే సమయానికి ఈ సినిమాపై ఆసక్తిని కోల్పోయారు.

మొత్తానికి ‘ఆలస్యం అమృతం విషం’ అనే సామెతకు పర్ఫెక్ట్ ఉదాహరణగా ఈ సినిమా నిలిచిందని చెప్పాలి.ఏదేమైనా కేజీఎఫ్ ఆలస్యమేఈ సినిమాకు ఎదురుదెబ్బగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube