ఆ ఫొటోతో 'కేజీఎఫ్‌' డైరెక్టర్‌ ను ఆట ఆడేసుకుంటున్న నెటిజన్స్‌

ఇండియాలోనే బిగ్గెస్ట్‌ యాక్షన్‌ చిత్రంగా కేజీఎఫ్‌ నిలిచింది.ప్రస్తుతం రూపొందుతున్న కేజీఎఫ్ 2 అంతుకు మించిన యాక్షన్ మూవీ అంటూ యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.

 Kgf Director Prashanth Neel Covid Vaccination Photo Goes Viral , Salaar, Film Ne-TeluguStop.com

అత్యంత ప్రతిష్టాత్మక యాక్షన్‌ మూవీని తెరకెక్కిస్తున్న ప్రశాంత్‌ నీల్‌ ఆ తర్వాత ప్రభాస్ తో సలార్ మూవీ ని కూడా రూపొందిస్తున్న విషయం తెల్సిందే.సలార్‌ కూడా అంతకు మించిన యాక్షన్‌ మూవీ అంటూ అంతా నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.

భయంకరమైన యాక్షన్‌ చిత్రాలను తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ చిన్న ఇంజక్షన్‌ కు మాత్రం ఇంతలా భయపడుతున్నాడు.తాజాగా ప్రశాంత్ నీల్ కోవిడ్‌ వ్యాక్సిన్ ను తీసుకున్నాడు.

ఆ సమయంలో ఆయన భయపడ్డాడు.ఆ ఫొటోలను నెట్టింట షేర్‌ చేయడం తో వైరల్‌ అవుతున్నాయి.

కేజీఎఫ్ లో వంద మందిని మట్టికరిపించేలా యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ చిన్న ఇంజక్షన్ కు మాత్రం మరీ ఇంతగా భయపడ్డాడు ఏంటీ అంటూ నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.చిన్న ఇంజక్షన్ కోసం ఇంతగా భయపడుతున్న ప్రశాంత్ నీల్‌ అంత భారీ యాక్షన్‌ సన్నివేశాలను ఎలా తెరకెక్కిస్తున్నాడు అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Salaar, Prabhas, Prasanthneel, Prashanth Neel, Yash-Movie

మొత్తానికి కేజీఎఫ్ దర్శకుడు కోవిడ్ వ్యాక్సిన్‌ కు భయపడుతున్నాడు అంటూ నెట్టింట సందడి చేస్తున్న మీమ్స్ అన్నీ ఇన్నీ కావు.ప్రశాంత్‌ నీల్‌ ను ఒక ఆట ఆడుకుంటూ మీమర్స్ చేస్తున్న మీమ్స్ ను తెగ షేర్ చేస్తున్నారు.ఎంతటి వాడైనా ఏదో ఒక విషయంలో కాస్త తగ్గాల్సిందే అని.ప్రశాంత్‌ నీల్‌ ఈ విషయంలో వీక్‌ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్‌ కేజీఎఫ్‌ 2 సినిమా ను ముగించి సలార్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆ తర్వాత ఎన్టీఆర్‌ తో కూడా సినిమా ను చేయబోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube