అమ్మ బాబోయ్ : కే.జీ.ఎఫ్ ఫేక్ ట్రైలర్ కి 5 రోజుల్లో కోటి వ్యూస్....- Kgf Chapter2 Fake Trailer Got One Crore Views In Youtube

KGF Chapter 2 fake TRAILER got one crore views in YouTube, Yash, Sanjay Dutt, Raveena Tandon, Srinidhi Shetty, Prashanth Neel - Telugu Kgf Chapter 2 Fake Trailer Got One Crore Views In Youtube, Prashanth Neel, Raveena Tandon, Sanjay Dutt, Srinidhi Shetty, Yash

మూడేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగు తమిళం, కన్నడ, హిందీ, తదితర భాషలలో విడుదలయి బాక్సాఫీసు వద్ద కన్నడ చిత్రం కేజిఎఫ్ ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో ఈ చిత్రం సీక్వెల్ గా తెరకెక్కుతున్న కేజీఎఫ్ చాప్టర్ 2

చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 Kgf Chapter2 Fake Trailer Got One Crore Views In Youtube-TeluguStop.com

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను కూడా చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయగా యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది.

అయితే ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్ సంస్థలు ఏదైనా సినిమాకి సంబంధించిన అప్డేట్లు లేదా ట్రైలర్లు, టీజర్లు, వంటివి విడుదలయితే ఏకంగా వాటిని తమదైన స్టైల్లో ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

 Kgf Chapter2 Fake Trailer Got One Crore Views In Youtube-అమ్మ బాబోయ్ : కే.జీ.ఎఫ్ ఫేక్ ట్రైలర్ కి 5 రోజుల్లో కోటి వ్యూస్….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కేజీఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్ అని థంబ్ నైల్ పెట్టి ఈ వీడియోని అప్లోడ్ చేశారు.కానీ ఇందులో కేజీఎఫ్ మొదటి చాప్టర్ మరియు రెండవ చాప్టర్ ట్రైలర్లను కలిపి హిందీ భాషలో ఎడిట్ చేశారు.

అయితే ఈ ట్రైలర్ విడుదల చేసిన ఐదు రోజులలోపే దాదాపుగా కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.దీంతో ఈ ట్రైలర్ చూసిన  కొందరు నెటిజన్లు ఇది ఫేక్ ట్రైలర్ అని కామెంట్లను చేస్తున్నారు.

మరికొందరు అభిమానులు మాత్రం ఇలాంటి ఫేక్ ట్రైలర్ల వల్ల అభిమానులు తప్పుదోవ పట్టే అవకాశం ఉందని, కాబట్టి  వెంటనే ఇలాంటి వీడియోలను తొలగించాలని అభిమానులు కోరుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో యష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు  పూర్తయి విడుదల కావాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ పనులు నిలిచిపోయాయి.అందువల్లే ఈ చిత్రం విడుదల మరింత ఆలస్యం అయ్యింది.

దాంతో ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేస్తున్నాడు.

#Yash #KGFChapter #Prashanth Neel #Raveena Tandon #Srinidhi Shetty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు