కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్  

Kgf Chapter 2 Teaser Release Date Fix - Telugu Hero Yash, Kannada, Kgf Chapter 2, Teaser Release Date Fix, Tollywood

బాహుబలి తర్వాత సౌత్ ఇండియా నుంచి కన్నడలో తెరకెక్కి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేజీఎఫ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుంది.

Kgf Chapter 2 Teaser Release Date Fix - Telugu Hero Yash, Kannada, Kgf Chapter 2, Teaser Release Date Fix, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మరోసారి కన్నడ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రాబోతుంది.ఇక ఈ సెకండ్ పార్ట్ లో సంజయ్ దత్ విలన్ గా కనిపించబోతున్నాడు.

అలాగే రవీనా టాండన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది.రాకింగ్ స్టార్ యష్ తో పాటు భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పుడు రెట్టింపు అంచనాలు ఉన్నాయి.

దీనికి తగ్గట్లే ఇప్పటికి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా ఫస్ట్ లుక్ కేజీఎఫ్ 2 మీద అంచనాలు పెంచింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా టీజర్ గురించి కన్నడ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది.

ఈ సినిమా టీజర్ ని ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు చెప్పుకుంటున్నారు.అలాగే జులై 30న సినిమా రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసారని టాక్.

అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ఇప్పటి వరకు ద్రువీకరించాకున్న ఇదే నిజం అని కన్నడ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.మరి ఇప్పటికే పోజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా మీద మరిన్ని అంచనాలు క్రియేట్ చేస్తుంది అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు

Kgf Chapter 2 Teaser Release Date Fix-kannada,kgf Chapter 2,teaser Release Date Fix,tollywood Related....