కేజీఎఫ్ కోసం లుక్ కి పదును పెట్టిన యష్! కచ్చితంగా చూడాల్సిందే  

కేజీఎఫ్ చాప్టర్ 2 లుక్ తో కేక పుట్టిస్తున్న హీరో యష్.

Kgf Chapter 2 Movie Hero Yash Look Leaked-

కన్నడ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా కేజీఎఫ్ గత ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఇక ఈ సినిమాకి ఉన్న అంచనాల నేపధ్యంలో కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీతో కలిపి ఏకంగా ఏడు భాషలలో సినిమాని రిలీజ్ చేసారు.ఇక రిలీజ్ అయిన తర్వాత సినిమాకి ఒక రేంజ్ లో హిట్ టాక్ వచ్చింది..

Kgf Chapter 2 Movie Hero Yash Look Leaked--KGF Chapter 2 Movie Hero Yash Look Leaked-

ఫుల్ హీరోయిజం ఎలివేట్ చేస్తూ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆవిష్కరించిన కోలార్ గోల్డ్ మైనింగ్స్ కథ కంటే హీరో యష్ పాత్ర ఆడియన్స్ కి భాగా కనెక్ట్ అయిపొయింది.అతని లుక్, స్టైల్, బిహేవియర్ అన్ని కూడా రెగ్యులర్ మాస్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి.దీంతో ఈ సినిమా ఏకంగా 250 కోట్లు కలెక్షన్ సొంతం చేసుకొని కన్నడ ఇండస్ట్రీ రికార్డ్స్ సృష్టించింది.

ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ కేజీఎఫ్ చాప్టర్ 2ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు.ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని ఇప్పటికే మొదలెట్టగా.

దీనిని మరింత ఎక్కువ బడ్జెట్ తో మరింత గ్రాండియర్ గా ఆవిష్కరించాలని ప్లాన్ చేస్తున్నారు.దానికి తగ్గట్లు గానే కాస్టింగ్ గా కూడా బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులని తీసుకుంటున్నారు.ఇక ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి హీరో యష్ లుక్ తాజాగా బయటకి వచ్చింది.ఇప్పుడు ఆ లుక్ లో మరింత రఫ్ గా , భారీగా గెడ్డంతో, జుత్తుతో యష్ కనిపిస్తున్నాడు.ఈ లుక్ యష్ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చింది.

మరి సినిమా ఎ రేంజ్ లో ఉంటుంది అనేది తెలియాలంటే వేచి చూడాలి.