సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్న యోధుడు... కేజీఎఫ్2 ఫస్ట్ లుక్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా కేజిఎఫ్.పాన్ ఇండియా మూవీగా ఏకంగా ఏడు భాషలలో ప్రేక్షకుల ముందికి వచ్చిన ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

 Kgf Chapter 2 First Look-TeluguStop.com

సౌత్ ఇండియాలో కంటే ఇది సినిమా హిందీలో అద్భుతమైన కలెక్షన్స్ అక్కడి ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది.సినిమాలో రాకీభాయ్ పాత్రలో హీరో యష్ చూపించిన హీరోయిజం, వీరోచిత పోరాట సన్నివేశాలు మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ కి `కొనసాగింపుగా కేజీఎఫ్ 2 ని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి మెయిన్ విలన్ అధీరా లుక్ లో సంజయ్ దంత్ ని పరిచయం చేసిన దర్శకుడు తాజాగా రాకీభాయ్ లుక్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు.

కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న రాకీభాయ్ అక్కడి కార్మికులకి ఎలా హీరోగా మారాడు.తన సైన్యంతో అధీరాపై ఎలాంటి పోరాటం చేశాడు అనే విషయాలని ఈ సినిమాలో చూపించబోతూ ఉండగా తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ లో కార్మికులకి సాయంగా స్టైలిష్ గా సిగరెట్ తాగుతూ ఉన్న రాకీబాయ్ ని రిప్రజెంట్ చేశారు.

ఈ పోస్టర్ లో రీబిల్దింగ్ యాన్ ఎంపైర్ అని ట్యాగ్ ఇచ్చాడు.అంటే సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు అని అర్ధం కాక.అతను ఈ సినిమాలో ఎలాంటి సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube