కేజిఎఫ్ సంచలన రికార్డ్.. 17 మిలియన్స్.. ఇది చెరపడం సాధ్యమేనా..

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తో ఏ రేంజ్ హిట్ అందుకున్నాడో అందరికి తెలుసు.కెజిఎఫ్ చాప్టర్ 1 భారీ హిట్ అందుకోవడంతో చాప్టర్ 2 స్టార్ట్ చేసి షూటింగ్ కూడా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచారు.

 Kgf Chapter 2 Create New Record, Yash, Kgf Chapter 2, Prashant Neil, Book My Show, Srinidhi Shetty-TeluguStop.com

రెండేళ్ల నుండి ఈ సినిమా కోసం సౌత్ ఇండియా మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా పెరిగాయి.

ఏప్రిల్ 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.రిలీజ్ అయినా అన్ని చోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగి పోయింది.

 KGF Chapter 2 Create New Record, Yash, KGF Chapter 2, Prashant Neil, Book My Show, Srinidhi Shetty-కేజిఎఫ్ సంచలన రికార్డ్.. 17 మిలియన్స్.. ఇది చెరపడం సాధ్యమేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఇప్పుడు కేజిఎఫ్ మ్యానియా దేశాన్ని ఊపేస్తోంది అనే చెప్పాలి.పార్ట్ 1 ను మించి సాలిడ్ ఎలిమెంట్స్ తో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది.

దీంతో ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి.ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏకంగా 1100 కోట్లు వసూళ్లను అందుకున్నట్టు సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

ట్రిపుల్ ఆర్ కంటే ఎక్కువ రాబట్టి ఇండియాస్ టాప్ 3 సినిమాగా నిలిచింది.ఇక ఈ సినిమా ఇప్పుడు మరొక అరుదైన ఘనత అందుకుని మరొక సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఈ రికార్డ్ విషయంలో మాత్రం టాప్ 1 గా నిలిచింది.దీంతో కెజిఎఫ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇంతకీ ఆ రికార్డ్ ఏంటా అని ఆలోచిస్తున్నారా.ప్రముఖ బుకింగ్ పోర్టల్ బుక్ మై షోలో కేజిఎఫ్ 2 సినిమా ఏకంగా 17 మిలియన్ టికెట్స్ అమ్ముడు పోయాయట.

ఈ రేంజ్ మరే సినిమా కూడా టికెట్స్ అమ్ముడు పోలేదు.చాలా బుకింగ్స్ అప్షన్స్ ఉన్నప్పటికీ ఈ సినిమా ఒక్క బుక్ మై షోలోనే ఈ రేంజ్ లో అమ్ముడు పోవడం నిజంగా సంచలనం అనే చెప్పాలి.

ముందు ముందు కూడా ఏ స్టార్ హీరో అందుకోలేని గొప్ప రికార్డ్ క్రియేట్ చేసారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube