ఘనంగా పెళ్లి చేసుకున్న కేజిఎఫ్ నటుడు పిల్ల జమిందార్ నటి... ఫోటోలు వైరల్!

ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతూ తమ జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.గత ఏడాది ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకోగా మరికొందరు నిశ్చితార్థం ఘనంగా జరుపుకున్నారు.

 Kgf Actor Pilla Zamindar Actress Got Married Photos Viral , Kgf Actor, Pilla Zam-TeluguStop.com

గత ఏడాది ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న కేజీఎఫ్ నటుడు వశిష్ట సింహ నటి హరిప్రియ తాజాగా పెళ్లి చేసుకొని కొత్త బంధంలోకి అడుగుపెట్టారు.జనవరి 26వ తేదీ నటుడు వశిష్ట సింహ నటి హరిప్రియల వివాహం ఎంతో ఘనంగా జరిగింది.

నటి హరిప్రియ తెలుగులో పిల్ల జమిందార్ సినిమాలో హీరోయిన్ గా నటించిన గుర్తింపు పొందినప్పటికీ ఈమెకు ఆశించిన స్థాయిలో తెలుగులో అవకాశాలు రాలేదని చెప్పాలి.ఇక కేజిఎఫ్ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు వశిష్ట సింహ హరిప్రియ ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.అయితే వీరి ప్రేమ విషయాన్ని ఎంతో రహస్యంగా ఉంచారు.ఇక వీరి ప్రేమ విషయం కుటుంబ సభ్యులు ముందు ఉంచి కుటుంబ పెద్దల అంగీకారంతో గత కొద్ది రోజుల క్రిందట ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.

ఇలా డిసెంబర్ నెలలో నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట ఈ ఏడాది జనవరి 26వ తేదీన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ సెలెబ్రిటీల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది సెలబ్రిటీలు, అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ప్రస్తుతం వశిష్ట సింహ హరిప్రియ వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube