కన్నడ సూపర్ స్టార్ యశ్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే.కేజీఎఫ్ మొదటి పార్ట్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం చేస్తున్న కేజీఎఫ్ 2 కూడా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టడంతో పాటు రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అంటున్నారు.
ముఖ్యంగా బాలీవుడ్లో ఈ సినిమా దుమ్ము రేపడం కన్ఫర్మ్ అన్నట్లుగా అభిమానులు మరియు ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు.
కేజీఎఫ్ 2 చిత్రం షూటింగ్ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో యశ్ తాజాగా గడ్డం ట్రిమ్మింగ్ చేయించుకున్నాడట.గత మూడు సంవత్సరాలుగా ఇలా గడ్డంను జీరో సైజ్‌కు ట్రిమ్ చేసుకోవడం ఇదే ప్రథమం.కేజీఎఫ్ ప్రారంభం అయినప్పటి నుండి కూడా యశ్ గడ్డంతోనే కనిపించాడు.
ఈ మూడు సంవత్సరాల్లో మొదటి సారి గడ్డం లేకుండా తాజాగా కనిపించాడు.మళ్లీ గడ్డం పెంచక పోవచ్చు అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం కేజీఎఫ్ స్టార్ యశ్ గడ్డం లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న కేజీఎఫ్ తో ఆల్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు.
కనుక సినిమాతోనే కాకుండా ఆయన వ్యక్తిగతంగా కూడా అందరిని ఆకట్టుకుంటున్నాడు.ముఖ్యంగా బాడీ మరియు లుక్ ఫరంగా ఎప్పుడు మీడియాలో ఉంటూనే ఉన్నాడు.
మొత్తానికి కేజీఎఫ్ స్టార్ ఇలాంటి లుక్‌తో కనిపించడం ఫ్యాన్స్‌కు కన్నుల పండుగగా ఉంది.