కేజీఎఫ్ 2 VS ఆర్ ఆర్ ఆర్ ... కింగ్ ఎవరో తెలుసా?

కేజీఎఫ్ చాప్టర్ – 2 వర్సెస్ ఆర్ ఆర్ ఆర్ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న హాట్ టాపిక్.రెండూ కూడా భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రమే కాకుండా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమాలు.

 Kgf 2 Vs Rrr Do You Know Which Is Best Yash-TeluguStop.com

రెండు చిత్రాల దర్శకులు కూడా ప్రతిష్టాత్మక ప్రతిభను కలిగి ఇండియన్ సినిమాలో తమ టాలెంట్ ను నిరూపించుకున్నవారే.మరి ఈ రెండు సినిమాల్లో ఏది బెస్ట్ ? ఏ చిత్రం టాప్ స్కోర్ ను సొంతం చేసుకుంది ? ఏ చిత్రం ప్రేక్షకుల మనసును ఎక్కువగా సొంతం చేసుకుంది? అలాగే ఏ సినిమా క్రిటిక్స్ ప్రశంసలను అధికంగా చూరగొంది అంటే వినపడుతున్న సమాధానాలు ఏమిటో ఇపుడు చూద్దాం.

ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా సినిమానే కానీ, ఇదో టాలీవుడ్ చిత్రం.కేజీఎఫ్ చాప్టర్ – 2 కన్నడ మూవీ.ఇది కూడా పాన్ ఇండియా చిత్రమే.ఆర్ ఆర్ ఆర్ సినిమా నిర్మాణానికి దాదాపుగా 400 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని సమాచారం.

ఇక కేజీఎఫ్ చాప్టర్ – 2 చిత్ర నిర్మాణానికి100 కోట్ల వరకు ఖర్చు అయ్యిందని సమాచారం.అంటే దీని ప్రకారం కేజీఎఫ్ సినిమా బజ్ కన్నా ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎక్కువ ఇంపాక్ట్ చూపాలి.

కానీ ఇక్కడ వాస్తవం లో అందుకు భిన్నంగా మాటలు వినపడుతున్నాయి.ఆర్ ఆర్ ఆర్ సినిమా రికార్డ్ స్థాయిలో వసూళ్ళు రాబట్టినప్పటికీ, బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నప్పటికీ కేజీఎఫ్ చాప్టర్ – 2 చిత్రం ముందు తేలిపోయిందని అంటున్నారు.

అందుకు గల కారణాలు ఇవే అని చెబుతున్నారు.

Telugu Alia Bhatt, Dailogues, Jr Ntr, Kgf, Prashanth Neel, Rajamouli, Ramcharan,

కేజిఎఫ్ సీక్వెల్ చిత్రంతో పోలిస్తే ఆర్ ఆర్ ఆర్ చిత్ర కథ బలంగా లేదుబ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో కూడా కేజీఎఫ్ చిత్రానిదే పైచేయి.ముఖ్యంగా డైలాగ్స్ విషయానికొస్తే కేజీఎఫ్ చిత్రానికి ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎక్కడో పది కిలోమీటర్ల దూరంలో ఉంది అన్నట్లుగా ఉంది.కేజీఎఫ్ సీక్వెల్ లో పంచ్ డైలాగ్స్ కోకొల్లుగా ఉన్నాయి.

కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో పంచ్ డైలాగ్స్ ను వేళ్లపై లెక్కపెట్టవచ్చు.కేజీఎఫ్ చాప్టర్ -2 సినిమాలోని డైలాగ్ సమాజాన్ని తట్టి లేపే విధంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.

ఒక్క‌సారి ఆ సినిమాలో కొన్ని డైలాగులు కనుక గుర్తు చేసుకుంటే ,

– నా కొడుకు శవాన్ని ఎవరూ మోయనక్కరలేదు… వాడి కాళ్లే వాడి శవాన్ని సమాధి వరకు తీసుకు వెళతాయి.

– ఇక్క‌డ త‌లలు శాశ్వ‌తం కాదు.

కిరీటాలు మాత్ర‌మే శాశ్వ‌తం.నెపోటిజం, నెపోటిజం, నెపోటిజం…మెరిట్‌ను ఎద‌గ‌నివ్వ‌రా ?

– రక్తం తో రాసిన కథ ఇది.సిరాతో తీసుకెళ్లలేమ్.ముందుకెళ్లాలంటే మళ్లీ రక్తాన్నే కోరుకుంటుంది.

అంటూ సాగే కొన్ని డైలాగ్స్ మనసు లోతుల్లోకి నేరుగా చొచ్చుకుపోయేలా రోమాలు నిక్కబొడుచుకొనేలా ఉన్నాయి.

Telugu Alia Bhatt, Dailogues, Jr Ntr, Kgf, Prashanth Neel, Rajamouli, Ramcharan,

మరి ఇలాంటి డైలాగ్ లు ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో వినపడలేదనే చెప్పాలి.దర్శకుడు రాజమౌళి మరియు ప్రశాంత్ నీల్ లు ఇరువురు కూడా గొప్ప దర్శకులే.ప్రతిభను మెండుగా కలిగిన దీరులే, ఎవరికి వారే సాటి.

అయితే ఎందుకో గాని దర్శకుడు రాజమౌళి టేకింగ్ పై ఉన్న కమాండ్ ను డైలాగ్ లపై పెద్దగా చూపడం లేదు అనే చెప్పలి.కానీ ప్రశాంత్ మాత్రం ప్రజల్లోకి చొచ్చుకుని పోయే పంచ్ డైలాగ్స్ కు తన సినిమాలలో ప్రత్యేక హోదా ఇస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube