21న టెండర్ పెట్టిన రాఖీ భాయ్

సౌత్ ఇండియాలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ యాక్షన్ మూవీ ‘కేజీఎఫ్ 2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం.

 Kgf 2 Treat On December 21, Kgf 2, Yash, Prashanth Neel, First Look, Tollywood N-TeluguStop.com

కాగా ఈ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ‘కేజీఎఫ్ 2’ షూటింగ్ ఇటీవల తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే.మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే ట్రీట్‌ను అందించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.డిసెంబర్ 21న ఉదయం 10.08 నిమిషాలకు ఈ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.అయితే ఈ ట్రీట్ ఏమిటనేది మాత్రం చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు.

ఈ సినిమాలోని హీరో పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తుందా లేక ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.ఏదేమైనా డిసెంబర్ 21న ఉదయం కేజీఎఫ్ చాప్టర్ 2 నుండి రాబోతున్న ఆ ట్రీట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ సాగుతోంది.

ఇక ఈ సినిమాలో రాకీ భాయ్‌గా యశ్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నాడు.కాగా విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా బాలీవుడ్ బ్యూటీ రవీనా టండన్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.మరి ఈ సినిమా నుండి రాబోతున్న ట్రీట్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న అంచనాలను ఎంతవరకు రెట్టింపు చేస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube