కేజీఎఫ్‌ 2 ను దక్కించుకునేందుకు పోటీ పడుతున్న దిల్‌రాజు, వరంగల్ శ్రీను

యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్‌ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను దక్కించుకున్న కేజీఎఫ్ కు సీక్వెల్‌ గా కేజీఎఫ్ 2 సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.

 Heavy Competition On Kgf 2 Telugu Dubbing Rights Between Dill Raju And Warangal-TeluguStop.com

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి అయ్యింది.త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కేజీఎఫ్‌ 2 సినిమాకు మొదటి పార్ట్‌ అనేది కేవలం ట్రైలర్ మాత్రమే అంటూ ప్రశాంత్ నీల్ అంటున్నాడు.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు నమోదు చేయడంతో పాటు ఇండియన్ సినీ చరిత్రలో కేజీఎఫ్‌ 2 నిలవడం ఖాయం అంటున్నారు.

అలాంటి ప్రతిష్టాత్మక మూవీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా తీసుకుని తమ సంస్థ పేరును పెంచాలని చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు.

Telugu Dill Raju, Kgf, Krack, Prasanth Neel, Prashanth Neel, Telugu, Warangal Sr

కేజీఎఫ్ 2 తెలుగు డబ్బింగ్‌ రైట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి.కేజీఎఫ్‌ 2 షూటింగ్‌ ప్రారంభం సమయంలో దాదాపుగా 50 కోట్ల వరకు పలికే అవకాశం ఉందని అనుకున్నారు.అప్పుడే అదే బిగ్గెస్ట్‌ అమౌంట్‌ అనుకున్నారు.

కాని ఇప్పుడు ఆ మొత్తంకు మరో 20 చేర్చారు.అంటే రూ.70 కోట్లకు కేజీఎఫ్‌ 2 డబ్బింగ్ ధర పలుకుతోంది.దిల్‌ రాజు ఈ సినిమా రైట్స్ ను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇలాంటి పెద్ద సినిమాలను దిల్‌ రాజు దక్కించుకుంటూ ఉంటారు.ఇప్పుడు అలాగే దిల్ రాజు కేజీఎఫ్‌ 2 కోసం చర్చలు జరుపుతున్నాడు.

ఈ సమయంలోనే క్రాక్‌ డిస్ట్రిబ్యూటర్‌ వరంగల్ శ్రీను కేజీఎఫ్‌ డబ్బింగ్‌ రైట్స్ ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుపుతున్నాడు.

తనకు ఉన్న పరిచయాలతో దిల్‌ రాజు కంటే ఎక్కువ ఆఫర్‌ చేసి కేజీఎఫ్ 2 సినిమా డబ్బింగ్‌ రైట్స్ ను తీసుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.క్రాక్‌ సినిమా సమయంలో దిల్‌ రాజుకు ఈయనకు వివాదం ఏర్పడింది.

దాంతో ఈయన దిల్ రాజును టార్గెట్‌ చేసి ఆయన సినిమాలను ఈయన దక్కించుకుంటున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube