కేజీఎఫ్ 2 టీజర్.. ఫ్యాన్స్‌కు నిరాశే!

కన్నడలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ కేజీఎఫ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దడంతో ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా అదిరిపోయే విజయాన్ని అందుకుంది.

 Kgf 2 Teaser Release Only In Kannada, Kgf 2, Yash, Prashant Neel, Kgf 2 Teaser,-TeluguStop.com

ఇక ఈ సినిమా అందుకున్న బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్-2 తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.కాగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో, కేజీఎఫ్ 2 టీజర్‌ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో కేజీఎఫ్ 2 టీజర్‌ను హీరో యశ్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.ఈ టీజర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమా టీజర్‌ను కేవలం కన్నడ భాషలో మాత్రమే రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.యశ్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న చిత్ర నిర్మాణ సంస్థ హోంబేల్ యూట్యూబ్ ఛానెల్‌లో కేవలం కన్నడలో మాత్రమే రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అంటే ఇతర భాషల ప్రేక్షకులకు కేజీఎఫ్ చిత్ర యూనిట్ నిరాశనే మిగిలించనుందని తెలుస్తుంది.

పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరోసారి మాస్ ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో కేజీఎఫ్-2 మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది.

ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube