కేజీఎఫ్‌ ఫ్యాన్స్‌ నిరాశ.. ఇంకా ఎన్నాళ్లు వెయిట్‌ చేయాలి భయ్యా

యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ 2 సినిమా విడుదల కోసం గత ఏడాది నుండి ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్‌ ఎంఓత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కేజీఎఫ్‌ సినిమా అన్ని భాషల్లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో కేజీఎఫ్ 2 సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

 Kgf 2 Movie Shooting Completed When Is Release Date-TeluguStop.com

అంచనాలు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ఈ సినిమా ను అంతకు మించి అన్నట్లుగా తెరకెక్కించాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఇటీవల విడుదల అయిన టీజర్‌ సినిమా పై అంచనాలను మరింతగా పెంచేసింది.

సినిమా ను గత అక్టోబర్‌ లో విడుదల చేయాలని భావించినా కూడా కరోనా కారణంగా షూటింగ్‌ ముగియలేదు.దాంతో సినిమాను ఈ జులై కు వాయిదా వేయడం జరిగింది.

 Kgf 2 Movie Shooting Completed When Is Release Date-కేజీఎఫ్‌ ఫ్యాన్స్‌ నిరాశ.. ఇంకా ఎన్నాళ్లు వెయిట్‌ చేయాలి భయ్యా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని జులై లో కూడా సినిమా విడుదలకు సంబంధించి కరోనా వల్ల అడ్డు తప్పలేదు.

Telugu Film News, Kannada Film, Kgf2, Movie News, Prashanth Neel, Yash-Movie

కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల వాయిదా పడ్డ కేజీఎఫ్‌ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కేజీఎఫ్‌ 2 సినిమా నుండి నేడు సంజయ్‌ దత్‌ లుక్‌ ను విడుదల చేశారు.ఆయన పుట్టిన రోజు సందర్బంగా విడుదల అయిన పోస్టర్‌ లో విడుదల తేదీ గురించి ఒక స్పష్టత ఇస్తారని అంతా నమ్మకంగా ఉన్నారు.

కాని తాజాగా విడుదల అయిన కేజీఎఫ్‌ 2 పోస్టర్ లో విడుదల తేదీ గురించి ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.సినిమా షూటింగ్‌ ను ఎప్పుడో ముగించిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పటి వరకు కూడా విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇవ్వలేక పోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సినిమా విడుదల తేదీ కోసం యశ్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు.కేజీఎఫ్‌ 2 సినిమా లో సంజయ్‌ దత్‌ పాత్ర అద్బుతంగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

కనుక బాలీవుడ్‌ లో కూడా ఈ సినిమా మరో లెవల్‌ లో ఉంటుందని అంటున్నారు.

#Yash #Kannada #KGF #Prashanth Neel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు