కేజీఎఫ్ 2 తెలుగు వంద కోట్లు.. నిజం ఎంత?

కన్నడ సినిమా కేజీఎఫ్ 2 తాజాగా విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఒక ఎత్తు అయితే ఓవరాల్‌ గా వెయ్యి కోట్లకు పైగానే వసూళ్లు సాధించి ఏకంగా ఆర్‌ ఆర్ ఆర్‌ రికార్డును బ్రేక్ చేసింది.

 Kgf 2 Movie Collections In Telugu States Details, Kgf 2, Kgf 2 Collections, Hero Yash, Director Prasanth Neel, Kgf Chapter 2, Kgf 2 Gross, 100 Crores, Rrr, Kgf 2 Rrr, Telugu States-TeluguStop.com

ముఖ్యంగా హిందీ వర్షన్ దంగల్‌ రికార్డును కూడా బ్రేక్‌ చేసింది.ఇన్ని రికార్డులను బ్రేక్ చేసిన కేజీఎఫ్ కు తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్ల వసూళ్లు కష్టం ఏమీ కాలేదు.

సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వంద కోట్లకు పైగా బిజినెస్ చేస్తే అంతా ముక్కున వేలేసుకున్నారు.మరీ ఇంత అరాచకం ఏంటీ భయ్యా అంటూ భయపడ్డారు.

 Kgf 2 Movie Collections In Telugu States Details, Kgf 2, Kgf 2 Collections, Hero Yash, Director Prasanth Neel, Kgf Chapter 2, Kgf 2 Gross, 100 Crores, Rrr, Kgf 2 Rrr, Telugu States-కేజీఎఫ్ 2 తెలుగు వంద కోట్లు.. నిజం ఎంత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కేజీఎఫ్ 2 ఒక వేళ నష్టపర్చితే సలార్‌ తో ఆ నష్టంను పూడ్చుతాము అంటూ ఆ సమయంలో బయ్యర్లు బలవంతంగానే వంద కోట్లకు ఇచ్చారు.

వారు ఏ నమ్మకంతో వంద కోట్లకు సినిమాను అమ్మారో కాని ఇప్పుడు వంద కోట్లకు పైగానే సినిమా రాబట్టింది.

ఇంకా సినిమా ఆడుతూనే ఉంది.ఇప్పటికే సినిమా కు 105 కోట్ల షేర్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటి వరకు 170 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ సమాచారం అందుతోంది.

మొత్తానికి కేజీఎఫ్ సినిమా అది కూడా కన్నడ సినిమా తెలుగు వర్షన్ వంద కోట్లు వసూళ్లు చేసింది అంటే మరెప్పటికి ఈ సినిమా రికార్డు బ్రేక్ అవుతుందో అర్థం కావడం లేదు.ఒక కన్నడ సినిమా ఇంత భారీ వసూళ్లను తెలుగు రాష్ట్రాల్లో సాధిస్తుంది.వసూళ్లు చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు ఏ ఒక్కరు ఊహించలేదు.

అందుకే అంత భారీ మొత్తం అన్నప్పుడు చాలా మంది వెనకడుగు వేశారు.కేజీఎఫ్ 2 దక్కించుకున్న సంచలన విజయాన్నికి ఇది సాక్ష్యం అనడంలో సందేహం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube