కేజీఎఫ్ 2 నుంచి రాఖీ భాయ్ లవర్ ఫస్ట్ లుక్

రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కేజీఎఫ్.పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

 Kgf 2 Makers Unveil Srinidhi Shetty's First Look Poster, Sandalwood, Tollywood,-TeluguStop.com

రిలీజ్ అయిన అన్ని భాషలలో సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుంది.

సంక్రాంతి బరిలో ఈ కేజీఎఫ్ సీక్వెల్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో యష్ చేసిన రాఖీ భాయ్ లవర్ పాత్రలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

సినిమాలో ఆమె ఇంట్రడక్షన్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది.సినిమాలో ఆమె కనిపించిన సన్నివేశాలు తక్కువగానే ఉన్న ఎలివేషన్ మాత్రం బాగుంటుంది.

అలాగే రౌడీ రాణిలా ఆమె క్యారెక్టర్ ని దర్శకుడు ప్రశాంత్ భాగా డిజైన్ చేశాడు.పూర్తిగా కథ మీద ఫోకస్ పెట్టడం వలన పాత్ర నిడివి తగ్గిపోయింది.

ఇదిలా ఉంటే కేజీఎఫ్ సీక్వెల్ లో కూడా శ్రీనిధి పాత్ర ఉండబోతుందని తెలుస్తుంది.అయితే ఇందులో ఆమె పాత్ర నిడివి ఎంత ఉంటుంది అనేది క్లారిటీ ఇవ్వకపోయిన ఆమె ఫస్ట్ లుక్ ని తాజాగా రివీల్ చేశారు.

శ్రీనిధి శెట్టి పుట్టినరోజు సందర్భంగా కేజీఎఫ్ 2 నుంచి ఆమె ఫస్ట్ లుక్ ని చిత్ర నిర్మాతలు రిలీజ్ చేసి విషెస్ చెప్పారు.ఈ లుక్ లో బ్లాక్ డ్రెస్ లో శ్రీనిధి చాలా అందంగా మెరిసిపోతుంది.

నిధి వెనకాల యశ్‌ ఉన్నట్లు తెలుస్తోంది.అయితే షేడ్‌తో చూపించారు.

మరి మొదటి భాగంలో హీరోహీరోయిన్ల మధ్య పెద్దగా సన్నివేశాలు లేవు.అయితే రెండో పార్ట్‌ లో మాత్రం కేజీఎఫ్ సామ్రాజ్యానికి నాయకుడుగా మారిన రాఖీ భాయ్ తో రొమాంటిక్ లవ్ సన్నివేశాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube