కేజీ మటన్ 200 మాత్రమే… కాకపోతే..?!  

mutton kilo, 200 rs, 600 rs, andhra pradesh, mutton shop, sales, police - Telugu 200 Rs, 600 Rs, Andhra Pradesh, Mutton Kilo, Mutton Shop, Police, Sales

ఈ మధ్యకాలంలో కొందరు వారి వ్యాపారాలను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ చివరికి లేని తిప్పలను కొని తెచ్చుకుంటున్నారు.తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో జరిగిన ఓ సంఘటన కూడా ఇలాంటి కోవకే చెందుతుంది.

TeluguStop.com - Kg Mutton 200rupees Krishna District

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.కృష్ణాజిల్లాలోని జి.కొండూరు లో ఓ మాంసపు దుకాణం వద్ద కేజీ వేట మాంసం కేవలం 200 రూపాయలు మాత్రమే అని బోర్డును పెట్టారు.ఇది చూసిన జనం ఆ మాంసం దుకాణం వద్ద క్యూ కట్టారు.

అయితే అక్కడికి వెళ్ళాక తెలిసింది అసలు కండిషన్ ఏమిటో.అదేమిటంటే వేట మాంసం కొనుక్కోవాలని వచ్చిన వారు ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకురావాలని ఓ చిన్న కండిషన్ పెట్టారు.

TeluguStop.com - కేజీ మటన్ 200 మాత్రమే… కాకపోతే..-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఆ సమయానికి ఆధార్ కార్డ్ తీసుకువచ్చిన వారు చాలా తక్కువ ఉన్నారు.ఆధార్ కార్డు తీసుకొని వచ్చిన వారికి కొద్ది మొత్తంలో వేటమాంసంని అందజేశారు.అయితే మరుసటి రోజు మాత్రం వేట మాంసాన్ని మామూలు ధరకు విక్రయించారు.దీంతో ఆ ఊరి ప్రజలందరూ షాప్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముందు రోజు కేవలం 200 రూపాయలు పెట్టిన మాంసం ధర నేడు మాత్రం 600 పెట్టారంటూ వారిపై మండిపడ్డారు ప్రజలు.

వీటితో పాటు కొందరు ముందటి రోజు 200 రూపాయలు పెట్టిన మాంసం చనిపోయిన గొర్రెలవి అని చెప్పుకొచ్చారు.

అయితే ఈ అంశానికి సంబంధించి ఆ షాప్ పై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున అక్కడ జనం గుమిగూడడంతో అక్కడ పెద్ద సమస్యగా మారింది.ఇకపోతే కేజీ మటన్ రెండు వందల రూపాయలకు అమ్మడం వెనకాల ఎంత నిజం దాగి ఉందో అసలు విషయం బయటకు తీయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ షాప్ సంబంధించి యజమానిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

#Police #600 Rs #Mutton Kilo #Sales #Andhra Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kg Mutton 200rupees Krishna District Related Telugu News,Photos/Pics,Images..