కరోనా ఎఫెక్ట్: కీలక మార్పులు చేసుకున్న కేఎఫ్‌సీ...!

కేఎఫ్‌సీ చికెన్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.“కేఎఫ్‌సీ… ఫింగర్ లికింగ్ గుడ్” అంటూ గత అరవై నాలుగు సంవత్సరాలుగా తమ చికెన్ ఫుడ్ ఐటమ్స్ ని ప్రచారం చేసుకుంటున్న ‘కెంటకీ ఫ్రైడ్ చికెన్‌’ కంపెనీ కరోనా పుణ్యమాంటూ ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.తమ సంస్థ యొక్క ట్యాగ్ లైన్ ‘ఫింగర్ లికింగ్ గుడ్’ కి అర్థం ఏమిటంటే… తమ ఫ్రైడ్ చికెన్ ఐటమ్స్ వేళ్ళు నాక్కొని చీక్కొని తినేంత బాగుంటాయని సింపుల్ గా చెప్పడం అన్నమాట.

 Corona Effect Kfc Has Made Key Changes  Kfc, Corona Effect, Kfc , Kfc Chicken, F-TeluguStop.com

కేఎఫ్‌సీ వాణిజ్య ప్రకటనలలో కూడా ఫ్రైడ్ చికెన్ ని తినేవారు తమ వేళ్ళను నాక్కుంటూ ఫుడ్ ని ఎంతగానో ఆస్వాదిస్తూ తింటుంటారు.

ఐతే ఈ ఫింగర్ లికింగ్ అనేది ప్రస్తుత కరోనా పరిస్థితులలో వాడకూడని పదమని… తక్షణమే ఫింగర్ లికింగ్ ప్రకటన పై నిషేధం విధించాలని ప్రపంచవ్యాప్తంగా అనేకమంది కేఎఫ్‌సీ కంపెనీ పై ఫిర్యాదు చేశారు.ఒక్క బ్రిటన్‌కు చెందిన ‘అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ’కి 163 ఫిర్యాదులు అందాయట.

దీంతో తమ కంపెనీ ప్రజలకు ఎటువంటి హాని చేసే యోచనలో అస్సలు లేదని… ఫింగర్ లికింగ్ గుడ్ ట్యాగ్ లైన్ ని తక్షణమే తొలగిస్తామని ప్రకటించింది.

ప్రస్తుతం కేఎఫ్‌సీ తమ అన్ని ప్రొడక్ట్స్ పై ‘ఫింగర్ లికింగ్ గుడ్’ కనిపించకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది.

ఐతే కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టిన అనంతరం ఫింగర్ లికింగ్ గుడ్ నినాదాన్ని యధావిధిగా ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది.ఇకపోతే కేఎఫ్‌సీ కి ప్రపంచవ్యాప్తంగా 22,621 బ్రాంచ్ లు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube