కువైట్ లోని భారత ఎంబసీ కీలక ప్రకటన..

కరోనా మహమ్మారి అన్ని దేశాలపై విశ్వ రూపం చూపించింది.ఈ నేపధ్యంలో పలు దేశాలు అక్కడి వలస వాసులపై ఆంక్షలు విధించడంతో అందరూ వారి వారి దేశాలకు తాత్కాలికంగా వెళ్ళిపోయారు.

 Key Statement From The Indian Embassy In Kuwait, Indian Embassy, Kuwait, India,-TeluguStop.com

ఇలా ఆయా దేశాలకు వచ్చిన వారిలో భారతీయులు అత్యధికంగా ఉన్నారు.ముఖ్యంగా కువైట్ నుంచీ భారత్ వచ్చిన వారు అధికంగా ఉన్నారని సర్వేలు కూడా చెబుతున్నాయి.

ఈ నేపధ్యంలోనే కువైట్ లోని భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది.

కరోనా సమయంలో కువైట్ నుంచీ భారత్ వెళ్ళిన ఎంతో మంది భారతీయులు అక్కడే ఉండిపోయారు.

కరోనా తీవ్రత అధికవండంతో నెలల తరబడి ఉద్యోగాలు వదులుకుని భారత్ లో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ ఈ క్రమంలో మళ్ళీ కువైట్ వెళ్ళాలనుకునే వారికి అవకాశం కల్పిస్తోంది కువైట్ లోని ఇండియన్ ఎంబసీ.

ఇందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మొదలు పెట్టింది.కువైట్ మళ్ళీ వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాలనుకునే వారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తీ చేయాల్సి ఉంటుందని తెలిపింది.

రిజిస్ట్రేషన్ లింక్ – https://docs.google.com/forms/d/e/1FAIpQLSdmHzfFP8ABp1-xRUZbyhBvGp39FQg2LhSEmBLjiMJcseC1Ng/viewform?gxids=7628

ఇలా రిజిస్ట్రేషన్ చేసుకావాలనుకునే వారి సంఖ్య పెరిగితే ఈ విషయాన్ని కువైట్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వారి ప్రయాణానికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపింది భారత ఎంబసీ.ఎంతో మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోవడం లేదా కువైట్ లో తమ భందువులకు దూరంగా ఉండటం, తమ వ్యాపారాల పునరుద్దరించాలనే పలు సమస్యలను రిజిస్ట్రేషన్ లో పొందుపరిస్తే వాటిని పరిష్కరించడానికి అన్ని విధాలుగా సహకరిస్తమాని ఎంబసీ ప్రకటించింది.అయితే గతంలో కరోనా కారణంగానే కువైట్ లోకి వలస వాసులను రానివ్వని అక్కడి ప్రభుత్వం తాజాగా భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కువైట్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube