టీడీపీలో కీలక మార్పులు ? ఆ భయం వెంటాడుతోందా ?  

Key Role Elements Changes In Tdp Party-tdp,ys Jagan,టీడీపీకి ఆగస్ట్ సెంటిమెంట్ బలంగా ఉందని,వైసీపీ దూకుడు ఎలా తగ్గించాలి

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉండడం, సామజిక సమీకరణాల లెక్కల్లో జగన్ తెలివిగా వ్యవహరించడం అన్ని విధాలా ఆ పార్టీకి బాగా కలిసి రావడంతో తెలుగుదేశం పార్టీలో అంతర్మధనం మొదలయ్యింది. ఎవరూ వేలెత్తి చూపని విధంగా కీలక పదవులను బడుగు బలహీన వర్గాలకు కేటాయించి జగన్ జేజేలు కొట్టించుకుంటున్నారు. అందుకే టీడీపీ కూడా అదే ఫార్ములాతో ముందుకు వెళ్లాలని చూస్తోంది..

టీడీపీలో కీలక మార్పులు ? ఆ భయం వెంటాడుతోందా ? -Key Role Elements Changes In TDP Party

అలాగే టీడీపీకి ఆగస్ట్ సెంటిమెంట్ కూడా ఎక్కువే. ఈ నెలలో పార్టీలో ఏదో జరిగిపోతుందని ఆ పార్టీ నేతలంతా వణికిపోతుంటారు. అందుకే ఈ రెండు నెలల పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమాలు చేయడం కానీ, విమర్శించడం కానీ చేయొద్దని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశాలు ఇస్తున్నాడు.

ఇక దీనికి సంబంధించి పార్టీ సీనియర్ నాయకులతో తాజాగా సమావేశమైన బాబు వైసీపీ దూకుడు ఎలా తగ్గించాలి , భవిష్యత్తులో పార్టీ పరంగా ఎటువంటి రోల్ పుషించాలి అనే అంశాల గురించి చర్చించారట. అదీ కాకుండా టీడీపీకి ఆగస్ట్ సెంటిమెంట్ బలంగా ఉందని, ఆ నెల తర్వాత టీడీపీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు సూచించాడట. ఈ నేపథ్యంలోనే టీడీపీ రాష్ట్ర కమిటీని మార్చడంతో పాటు పోలిట్ బ్యూరో సభ్యులను కూడా మార్పు చేస్తేనే మంచిదని పలువురు అభిప్రాయపడ్డారట. అందుకే ప్రస్తుతం ఉన్న పోలిట్ బ్యూరో సభ్యులను పూర్తిగా మార్చేసి యూత్ కి అవకాశం ఇవ్వాలని బాబు అభిప్రాయపడుతున్నాడు.

పార్టీ సీనియర్ నాయకులకులకు ప్రస్తుతం ఉన్న పదవులను తప్పించి పార్టీ సలహాదారులుగా నియమించాలని, 45 సంవత్సరాల లోపు ఉన్న యువకులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని అధినేత చంద్రబాబు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. బాబు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలలో పార్టీ బలంగా లేకపోవడంతో ఇక తన దృష్టంతా ఏపీ పైనే పెడతానని సీనియర్ నాయకులతో చంద్రబాబు నాయుడు అన్నట్లు తెలుస్తోంది. టీడీపీకి దూరమైన బడుగు, బలహీన వర్గాలను ఆకట్టుకునేందుకు ఆ వర్గాలకు చెందిన వారికి పార్టీ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీల్లో కీలక పదవులు ఇవ్వడంతో పాటు అవసరం అయితే టీడీపీ ఏపీ అధ్యక్ష పదవిని బలహీన వర్గాలకు అప్పగించాలని బాబు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.