కృతజ్ఞత చూపించాడుగా...20 మంది భారతీయులకు కీలక భాద్యతలు..!!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్స్ ఓట్లు పడకుండా గెలుపు అసాధ్యమనే విషయం అందరికి తెలిసిందే.అందుకోసమే పోటీ చేసే అభ్యర్ధులు ఇండో అమెరికన్స్ ఓట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

 Key Responsibilities For 20 Indians, Kamala Harries, Joe Biden, Nri, Art, Rahul-TeluguStop.com

వారిని ప్రసన్నం చేసుకువడానికి హామీల వర్షం కురిపిస్తూ ఉంటారు.అయితే ట్రంప్ ఎన్నారై ఓట్లను దూరం చేసుకుంటున్న సమయంలో బిడెన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

వీసాల, వలస వాసుల ఉద్యోగాల విషయంలో ఎన్నారైలకు అభయహస్తం ఇచ్చిన బిడెన్ వైపే భారతీయ అమెరికన్స్ నడిచారు.ఓట్లేసి గెలిపించారు.అయితే

ఓట్లేసిన భారతీయ అమెరికన్స్ పై కృతజ్ఞత చూపించుకునే పనిలో పడ్డారు బిడెన్.అధికారాన్ని ముందు అధికార బదలాయింపుల కోసం ఏజన్సీ సమీక్షా బృందాలను (ఏఆర్ టీ) బిడెన్ ఏర్పాటు చేశారు.

ఈ బృందాలలో సుమారు 20మంది భారతీయ అమెరికన్స్ కు చోటు కల్పించారు.అంతేకాదు ఈ 20 మందిలో ముగ్గురుకి ఈ బృందాలను లీడ్ చేసే అవకాశం కల్పించారు.

ఏఆర్ టి యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే.పరిపాలన విధానంలో వివిధ శాఖలకు చెందిన కార్యకలాపాలు అంచనా వేసి వాటిలో అధికార బలాయింపు నిష్పాక్షపాతంగా జరిగేలా చూడటమే దీని ముఖ్య ఉద్దేశ్యం.

బిడెన్, కమలా హారీస్ లు తమ పరిపాలన సజావుగా సాగేలా ఈ బృందాలు పరిపాలన వ్యవస్థని గాడిలో పెట్టనున్నాయి

ఈ బృందాలలో ముఖ్యంగా 3 బృందాలకు 20 మంది భారతీయ అమెరికన్స్ లో ముగ్గురు సారధ్యం వహించనున్నారు.వారిలో ఒకరు రాహుల్ గుప్తానేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ, రెండు అరుణ్ మజుందార్ – డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ భాద్యతలు చేపట్టనున్నారు.

మూడు కిరణ్ అహుజా – సిబ్బంది కార్యాలయ నిర్వహణ భాద్యతలు చేపట్టనున్నారు.ఇక మిగిలన వారు బృందాలలో సభ్యులుగా కొనసాగనున్నారు.ఇదిలాఉంటే భారతీయ అమెరికన్స్ కు ఇంత పెద్ద ఎత్తున ఒకే సారి కీలక భాద్యతలు అప్పగించడం ఇదే మొదటిసారని బిడెన్ ఈ రూపంలో కృతజ్ఞతలు చూపించాడని అంటున్నాయి ఇండో అమెరికన్స్ సంఘాలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube