కీలక నాయకులకు కీలక పదవులు ! అయినా అసంతృప్తే ?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతోంది.

కీలక నాయకులనుకున్న వారంతా అసంతృప్తికి గురవుతూ, తమ పదవులకు రాజీనామా చేస్తూ ఉండడం, మరి కొంతమంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, కొంతమంది పార్టీ విధానాలను ప్రశ్నిస్తూ మీడియా వేదికగా విమర్శలు చేయడం వంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి.

ఇప్పటికే కొంతమందిపై బహిష్కరణ వేటు పడగా,  ఇంకొంతమంది విషయంలో బుజ్జగింపు ధోరణితో ముందుకు వెళ్తున్నారు.మరోవైపు చూస్తే సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడింది.

ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉండడంతో, పార్టీలో పరిస్థితులు అధినేత జగన్ కు తలనొప్పులు తీసుకొస్తున్నాయి.ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారిపై బహిష్కరణ వేటు వేశారు.

ఇదిలా ఉంటే జగన్ కు బంధువు , పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Balineni Srinivasa Reddy ) ఇటీవల పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు.అయితే దీనికి కారణాలు అనారోగ్య సమస్యలతో పాటు, సొంత నియోజకవర్గమైన ఒంగోలు పై దృష్టి పెట్టేందుకే అని బాలినేని చెప్పినా,  ఆయన అసంతృప్తి వెనుక కారణాలు చాలానే ఉన్నాయి.ఇదే విషయమై జగన్ క్యాంపు కార్యాలయం కు పిలిచి మరీ బుజ్జగించారు.

Advertisement

అయితే బాలినేని వ్యవహారం మరొక కొద్ది రోజుల్లో గాని క్లారిటీ రాదు.ఇదిలా ఉంటే బాలినేని బాటలోనే మరికొంతమంది పార్టీ పదవుల విషయంలో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ల పదవులు పార్టీ సీనియర్ నేతలు, కీలకమైన వ్యక్తులకు జగన్ అప్పగించారు. వైసీపీలో కీలక నేతగా పేరుపొందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అన్నమయ్య, చిత్తూరు అనంతపురం , సత్యసాయి జిల్లాలు అప్పగించగా, సీనియర్ నాయకుడు మంత్రి బొత్స సత్యనారాయణ కు పార్వతీపురం , మన్యం,  అల్లూరి సీతారామరాజు,  శ్రీకాకుళం జిల్లా బాధ్యతలను అప్పగించారు .

అలాగే తన బాబాయి టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డికి విశాఖపట్నం, అనకాపల్లి ,విజయనగరం జిల్లా లు అప్పగించగా, ఎంపీ మిధున్ రెడ్డి ,రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్( Pilli Subhash Chandra Bose ) కు ఏలూరు,  పశ్చిమగోదావరి , తూర్పుగోదావరి,  కాకినాడ,  కోనసీమ జిల్లాలు అప్పగించారు.అలాగే ఎంపీ ఆళ్ళ అయోధ్య రామ రెడ్డి , ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ లకు కృష్ణ , ఎన్టీఆర్ , గుంటూరు జిల్లాలు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి,  బీద మస్తాన్ రావు లకు పల్నాడు, బాపట్ల ప్రకాశం జిల్లాలు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి తిరుపతి , కడప , నెల్లూరు జిల్లాలు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి నంద్యాల,  కర్నూలు జిల్లాల బాధ్యతలను అప్పగించారు.అయితే ఈ పార్టీ పదవులు విషయంలో చాలామంది ఆసక్తి చూపించడం లేదట.

ఇది తనకు శక్తికి మించిన భారంగానే పరిగణిస్తున్నారట.తనకు అత్యంత సన్నిహితులైన సీనియర్ నేతలకు పార్టీ కీలక బాధ్యతలను అప్పగించినా, వారు ఈ పదవులు విషయంలో అంత ఆసక్తి చూపించకపోవడం వంటివి జగన్ కు కూడా గందరగోళం కలిగిస్తున్నాయట.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు