బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డులో ఆ నేత‌ల‌కు కీల‌క ప‌ద‌వి..

బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డులో కొత్త‌వారికి స్థానం ద‌క్కింది.క‌ర్ణాట‌క మాజీ సీఎం య‌డ్యూర‌ప్ప‌, అస్సాం మాజీ ముఖ్య‌మంత్రి స‌ర్బానంద సోన్వాల్, తెలంగాణ నేత ల‌క్ష్మ‌ణ్ ల‌ను కొత్త‌గా పార్ల‌మెంట‌రీ బోర్డులోకి తీసుకున్నారు.

 Key Leaders In Bjp Parliamentary Board Details, Key Leaders ,bjp Parliamentary B-TeluguStop.com

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా కేంద్ర పార్ల‌మెంట‌రీ బోర్డును ఏర్పాటు చేసిన‌ట్లు బీజేపీ పార్టీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.అయితే వీరిలో జేపీ న‌డ్డా అధ్య‌క్షుడిగా ఉండ‌గా, ఇత‌ర స‌భ్యులుగా ప్ర‌ధాని మోడీ, ర‌క్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, క‌ర్ణాట‌క మాజీ సీఎం యాడ్యూర‌ప్ప‌,అస్సాం మాజీ సీఎం స‌ర్బానంద సోనోవాల్, తెలంగాణ బీజేపీ నేత కె.లక్ష్మ‌ణ్, ఇక్బాల్ సింగ్, సుధా యాదవ్ ఉన్నారు.

కేంద్ర పార్ల‌మెంట‌రీ బోర్డు కార్య‌ద‌ర్శిగా బీఎల్ సంతోష్ వ్య‌వ‌హ‌రిస్తారు.

బీజేపీ పార్టీలో విధాన రూప‌క‌ల్ప‌న‌లో అత్యంత ముఖ్య‌మైన‌, శ‌క్తివంత‌మైన యూనిట్ పార్ల‌మెంట‌రీ బోర్డు.పార్ల‌మెంట్ బోర్డుతో పాటు కొత్త కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీని కూడా బీజేపీ ఏర్పాటు చేసింది.

ఇందులో షాన‌వాజ్ హుస్సేన్ పేరు లేదు.ఎన్నిక‌ల సంఘ‌లో మొత్తం 15మందికి చోటు ద‌క్కింది.

ఇందులో ప్ర‌ధాని మోడీ పాటు అమిత్ షా, దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ లు కూడా ఉన్నారు.దింతో పాటు కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాద‌వ్ ను కూడా చేర్చారు.

Telugu Amit Sha, Bl Santosh, Ikbal Singh, Jagatprakash, Lakshman, Key, Naredra M

అయితే తెలంగాణ‌కు చెందిన బీజేపీ నేత కె.ల‌క్ష్మ‌ణ్ ను పార్ల‌మెంట‌రీ బోర్డుతో పాటు పార్టీ ఎన్నిక‌ల క‌మిటీలోనూ చేర్చ‌డం వెనుక బీజేపీ ల‌క్ష్యం తెలంగాణ‌లో అధికారం సాధించ‌డ‌మే అనే విష‌యం అర్థ‌మ‌వుతుంది.అయితే కొంత‌కాలంగా తెలంగాణ‌లో బీజేపీ పార్టీ బ‌ల‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఇక్క‌డి నేత‌ల‌కు ప్రాధాన్య‌త ఉన్న ప‌ద‌వులు ఇవ్వ‌డంపై బీజేపీ పార్టీ ఫోక‌స్ పెట్టింది.ఇందులో భాగంగానే యూపీ నుంచి ల‌క్ష్మ‌ణ్ ను రాజ్య‌స‌భ‌కు పంపింది.

తాజాగా ఆయ‌న‌ను బీజేపీ పార్టీలోని అత్యున్న‌త‌, ప్రాధాన్య‌త క‌లిగిన క‌మిటీల్లో చోటు క‌ల్పించి.తెలంగాణ రాష్ట్రం త‌మ‌కు ఎంత ముఖ్య‌మైన‌దో మ‌రోసారి క్లారిటీ ఇచ్చింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube