మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికారులు కేంద్ర హోం శాఖతో చర్చకు కూర్చోబోతున్నారు.ఈ సందర్భంగా ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖ అధికారులతో రాష్ట్రానికి సంబంధించి ఏ విషయాలను చర్చించాలి అనేదానిపై రాష్ట్ర అధికారులకు సీఎం జగన్ కీలక సూచనలు చేశారు.
ప్రధానంగా రాష్ట్ర విభజన హామీల గురించి.చర్చించాలని స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం, నష్టం.మొత్తం అంతా కూడా వివరించాలని పేర్కొన్నారు.
అంత మాత్రమే కాకుండా తెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిల గురించి కూడా అడగాలని సూచించారు.
ఇవి మాత్రమే కాకుండా రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అప్పట్లో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు గురించి కూడా చర్చించాలని అధికారులకు సూచించారు.పోలవరం ప్రాజెక్టు అదేవిధంగా ప్రత్యేక హోదా .ఇంకా నిధుల గురించి అడగాలంటూ అవగాహన కల్పించారు.ఏ అంశాలపై కేంద్ర హోం శాఖను అడగాలి అన్నదానిపై ఓ అవగాహనను కలిగించారు.విభజన జరిగిన తర్వాత జరిగిన అన్యాయం.అన్ని విషయాలను లెక్కలతో సహా కేంద్ర హోంశాఖ అధికారులు దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.ఈ రకంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని స్పష్టం చేశారు.