వివేకా హ‌త్య కేసులో కీల‌క ఆధారాలు బ‌య‌ట‌కు..!

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్టు బయటపడుతున్నది.సీబీఐ దర్యాప్తులో పలు కీలక విషయాలు బయటకు వచ్చినట్లు సమాచారం.

 Key Evidence In Viveka Murder Case Leaked-TeluguStop.com

వివేకా హత్య కేసులో ఆయన ఇంటి వాచ్‌మెన్ భడవాండ్ల రంగన్న కీలక సాక్ష్యం.కాగా, ఇంతకీ ఆయన వాంగ్ములంలో పేర్కొన్న విషయాలెంటి? వివేకా హత్యకు ఎవరు సుపారీ ఇచ్చారు? 2019లో మార్చి 15వ తేదీన వైఎస్ వివేకా హత్య జరిగిన సంగతి తెలిసిందే.ఆ సమయంలో వివేకా ఇంటి వాచ్‌మెన్‌గా భడవాండ్ల రంగన్న ఆలియాస్ రంగయ్య ఉన్నాడు.

Telugu Cbi, Erra Gangareddy, Key Evidence In Viveka Murder Case Leaked, Rangayya, Viveka Murder Case-Telugu Political News

ఈయనే ఈ కేసులో మెయిన్ సాక్షి.వైఎస్ వివేకాను చివరిసారి చూసింది కూడా ఈయనే.రంగయ్య ఆ రోజున ఉదయం నిద్రలేచి వివేకా ఇంకా బయటకు రావడం లేదని లోనికి వెళ్లి చూడగా బాత్ రూంలో రక్తపుమడుగులో ఉన్నట్లు రంగయ్య తెలిపాడు.

 Key Evidence In Viveka Murder Case Leaked-వివేకా హ‌త్య కేసులో కీల‌క ఆధారాలు బ‌య‌ట‌కు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలా వివేకా లేరనే విషయాన్ని ఆయనే అందరికీ తెలిపాడు.మొత్తంగా ఈ హత్య కేసులో రంగయ్యనే కీలక సాక్షి.తాజాగా రంగయ్యను సీబీఐ అధికారులు విచారించారు.ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.వైఎస్ వివేకా హత్య కోసం ఇద్దరు వ్యక్తులు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చినట్లు రంగయ్య జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది.దాంతో ఈ వాంగ్మూలం కీలకంగా మారబోతోందని సమాచారం.ఆ ఇద్దరు వ్యక్తులతో పాటు మరో ఐదుగురికి హత్యతో సంబంధమున్నట్లు రంగయ్య చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే, అందులో పాత్రధారిగా ఎర్ర గంగారెడ్డి పేరు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తుండగా, వాటిని గంగారెడ్డి ఖండించారు.వివేకానందరెడ్డిని ఎదిరించే ధైర్యం తనకు లేదని పేర్కొన్నాడు.

ఎర్ర గంగారెడ్డితో పాటు జిల్లాకు చెందిన మరో ముగ్గురు కీలక వ్యక్తుల పేర్లు వాంగ్ములంలో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.అయితే, అది ఎంత వరకు నిజమనేది విచారణ పూర్తయ్యాకనే తేలుతుంది.

మొత్తంగా వైఎస్ వివేకా హత్యాకేసు రోజుకో మలుపు తిరుగుతున్నదనే చెప్పొచ్చు.

#KeyEvidence #Erra Ganga #Viveka #Rangayya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు