ఢిల్లీ మద్యం కేసులో కీలక ఆధారాలు.. ఆ నేతలే టార్గెట్

ఒకే ఒక కేసు.100కు పైగా ఖాతాలు ప్రవాహాన్ని పట్టించింది.వాటి మాటును దాగిన బినామీ వ్యక్తులను, వారి వెనుక ఉన్న పెద్దల బండారాన్ని బట్టబయలు చేయబోతుంది.

ఎక్కడో ఢిల్లీలో మొదలైన మద్యం కేసు ఇప్పుడు అన్యుహంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రముఖుల మెడకు చుట్టుకోబోతుందని ఇందులో అనేకమంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.వీరిలో మద్యం కేసులో సంబంధం ఉన్నవారు కొద్దిమంది అయినా ఇతర వ్యాపార కార్యకలాపాలు, అనధికారిక పెట్టుబడును నల్లధనాన్ని చట్టబద్ధం చేసి ప్రయత్నాలకు సంబంధించిన విలువైన సమాచారం ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ మద్యం ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మూడుసార్లు నిర్వహించిన విషయం తెలిసిందే.ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న అరుణ్ రామచంద్రని ఈ కేసులో సిబిఐ చేర్చడంతో ఆయనతో కలిసి వ్యాపారాలు చేస్తున్న వారిపైన సిబిఐ దర్యాప్తు ప్రారంభించారు.

దీనిలో భాగంగానే ఈడి అధికారులు రామచంద్ర ఇల్లు కార్యాలలో సోదాలు నిర్వహించింది.తర్వాత ఆయనతో వివిధ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్న బోయినపల్లి అభిషేక్, ప్రేమ్ సాగర్ తదితరులపై సిబిఐ దృష్టి సాధించింది.

Advertisement
Key Evidence In The Delhi Liquor Case Those Leaders Are The Target Details, Delh

వాస్తవానికి ఇంతటితో ఈడి దర్యాప్తు పూర్తవుతుందని అనుకున్నారు.కానీ అన్ని రంగా మద్యం ముడుపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో గోరంట్ల అసోసియేట్లు సంస్థ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

అక్కడ జరిపిన సోదాలు మద్యం కేసు దర్యాప్తును మలుపుతిప్పినట్లు తెలుస్తోంది.

Key Evidence In The Delhi Liquor Case Those Leaders Are The Target Details, Delh

పదుల సంఖ్యలో సంస్థలు వాటికి సంబంధించి 100కు పైగా ఖాతాలు వివరాలు ఈడి చేతికి చిక్కినట్లు సమాచారం.వినమనేని శ్రీనివాసరావు వ్యవహారం ఇలాగే బయటకు వచ్చింది.గోరంట్ల కార్యాలయంలో సోదాలు చేసే వరకు ఆయనెవరు ‎ఈడి అధికారులకు తెలియదు.

అక్కడ లభించిన పత్రాల ఆధారంగా అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు కు చెందిన వివిధ ఖాతాల నుంచి అనుమానాస్పద లావాదేవీల జరిగినట్లు గుర్తించారు.రాష్ట్రంలోని పలువురు ప్రముఖులకు శ్రీనివాసరావు బినామీ కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

మరో రెండు సాఫ్ట్వేర్ సంస్థల పేర్లు ఇలాగే వెలుగులోకి రావడంతో వాటిలోనూ సోదాలు నిర్వహించారు.

Advertisement

ఈడి సోదాల్లో బయటపడ్డ సంస్థలు ఖాతాల్లో కొన్నిటికి మద్యం కేసుతో సంబంధం లేకపోయినా అనుమానాస్పద లావాదేవీలు ఉన్నందున వీటిని విడివిగా దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఈ ఖాతాల వెనుక ఉన్న వ్యక్తులు సంస్థల బినామీ లేనని వారు ఎవరికి బినామీల అన్నది నెగ్గు తెలిస్తే ఇది మరో మారు రాజకీయ ప్రకపనాలు సృష్టించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.వారిపై ఆదాయ పన్ను చట్ట నిబంధన ప్రకారం బినామీ నిరోధక చట్టం ప్రయోగించే అవకాశం ఉంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే ఆదాయ పన్ను శాఖకు అందజేసినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు