టీఆర్ఎస్ లో కీలక పరిణామాలు...పక్క చూపులు ఖాయమేనా?

తెలంగాణ  రాజకీయాలు రోజు రోజుకు ఎవరూ ఊహించనంత వేగంగా మారుతున్నాయి.అయితే అధికార టీఆర్ఎస్ ను ఢీ కొనే సత్తా ఏ ప్రతిపక్షానికి లేనటువంటి పరిస్థితిలో  ప్రస్తుతం దానికి భిన్నంగా పరిస్థితులు మారిపోయిన పరిస్థితి ఉంది.

 Key Developments In Trs ..are Side Views Permanen Trs Party, Kcr , Ts Potics , B-TeluguStop.com

అయితే ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశావాదులు ఎక్కువైన పరిస్థితిలో అందరికీ ఒకేసారి న్యాయం చేయని పరిస్థితి ఉంటుంది కావున ఎవరైతే ఎమ్మెల్సీ ఆశించారో వారు కొంత నిరాశకు గురైన పరిస్థితి ఉంది.దీంతో టీఆర్ఎస్ లో పరిణామాలు చాలా వేగంగా మారుతున్న పరిస్థితి ఉంది.

ఇప్పటికే గట్టు రామ చంద్రరావు, సర్దార్ రవీంద్ర సింగ్ లాంటి నేతలు టీఆర్ఎస్ కు రాజీనామా చేయడంతో అసలు టీఆర్ఎస్ లో ఏం జరుగుతుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైందని చెప్పవచ్చు.

అయితే అసంతృప్తులు అనేవారు రాజకీయాల్లో ఉండటం చాలా సహజమని, అయితే ప్రతి ఒక్క పార్టీకి ఇలాంటి పరిస్థితులు ఎదురావుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

కానీ వేరే ప్రతిపక్ష పార్టీలో ఇలా జరిగితే పెద్దగా చర్చ ఉండేది కాదు.కానీ జరిగింది అధికార పార్టీలో కాబట్టి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది .అయితే ఇక్కడ ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్న విషయమేమిటనే విషయాన్ని పరిశీలస్తే అసంతృప్తులను ఏ మాత్రం బుజ్జగించే ప్రయత్నం చేయకపోవడం.

Telugu @cm_kcr, @trspartyonline, Bjp, Gatturama, Harish Rao, Sardarravindra, Tel

ఇన్ని ఏళ్లుగా పార్టీలో పనిచేసిన వారికి టీఆర్ఎస్ ఇచ్చిన గుర్తింపు ఇదేనా అంటూ ఈఅంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుత టీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలను బట్టి రానున్న రోజుల్లో మరికొంత మంది నేతలు పక్కచూపులు చూసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.అయితే కెసీఆర్ ఒక్కడిపైనే ఇటు పరిపాలనా భారం, ఇటు పార్టీ భారం ఉండడంతో అంతేకాక స్థానిక పరిస్థితులను బట్టి తీసుకున్న కొన్ని నిర్ణయాలతో అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయని టీఆర్ఎస్ అభిప్రాయ పడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube