ఐపీఎల్ 2021 రూల్స్ లో కీలక నిర్ణయం..!?

ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9వ తేదీన జరగనున్న నేపథ్యంలోనే బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ కి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఫీల్డ్ అంపైర్ ఇచ్చే సాఫ్ట్ సిగ్నల్ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.

 Key Decision In Ipl 2021 Rules . Ipl, Ipl2021, Key Desicion, New Rules, Viral Ko-TeluguStop.com

అంతేకాకుండా షార్ట్ రన్ పై రివ్యూ చేసే అధికారాన్ని థర్డ్ అంపైర్ కు అప్పజెప్పింది.దీంతో ఫీల్డ్ ఎంపైర్ ఒకేసారి రెండు అధికారాలను కోల్పోయినట్టు అయ్యింది.

మామూలుగా ఏదైనా ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ కి రివ్యూ ఇచ్చినప్పుడు ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఇస్తుంటారు.అతడిచ్చిన సిగ్నల్ ను బట్టి థర్డ్ అంపైర్ తుది తీర్పు ఇస్తూ ఉంటారు.

కానీ కొన్ని సందర్భాల్లో ఫీల్డ్ అంపైర్ ఇచ్చే సాఫ్ట్ సిగ్నల్స్ వివాదాస్పదం అవుతున్నాయి.దీని వల్ల అవుట్ కాని ప్లేయర్లు కూడా పెవిలియన్ బాట పట్టాల్సి వస్తోంది.

ఇటీవల ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య జరిగిన టీ 20 మ్యాచ్ లో ఫీల్డ్ అంపైర్ తప్పుగా సాఫ్ట్ సిగ్నల్ ఇవ్వడంతో పెద్ద రచ్చ జరిగింది.సూర్యకుమార్ కొట్టిన బంతిని డేవిడ్ మలన్ క్యాచ్ పట్టుకున్నారు.

కానీ ఆ బంతి గ్రౌండ్ ని తాకింది.ఇదే దృశ్యాలను రివ్యూ చేస్తున్న సమయంలో చాలాసార్లు పరిశీలించారు కానీ ఫీల్డ్ అంపైర్ ఔట్ అని సాఫ్ట్ సిగ్నల్ ఇచ్చారు.

దీంతో థర్డ్ అంపైర్ సూర్య కుమార్ ని అవుట్ అని ప్రకటించారు.ఫలితంగా టీమిండియా ఆటగాళ్లలో తీవ్ర ఆగ్రహం వెళ్లువెత్తింది.

ఇలాంటి తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహాపలువురు ప్రముఖ క్రికెటర్లు అభ్యర్థన పెట్టుకున్నారు.అయితే అతడి అభ్యర్థన మేరకు కేవలం థర్డ్ అంపైర్ కి మాత్రమే ఔట్ కాదో అనే అంశాన్ని సమీక్షించి నిర్ణయం తీసుకునే అధికారాన్ని బీసీసీఐ కల్పించింది.

Telugu Bcci, Ipl, Key, Ups, Kohili-Latest News - Telugu

అలాగే పరుగులు తీసే క్రమంలో బ్యాట్స్‌మెన్‌ బ్యాట్ ని క్రిజ్ లో సరిగా పెట్టకపోతే దాన్ని షార్ట్ రన్ కింద పరిగణిస్తారు.ఆ పరుగు ని స్కోర్ నుంచి తొలగిస్తారు.అయితే షార్ట్ రన్ విషయంలో తీర్పు ఇచ్చే అధికారం కేవలం ఫీల్డ్ అంపైర్ కి మాత్రమే ఉంటుంది.కానీ ఇప్పుడు బీసీసీఐ ఆ అధికారాన్ని కూడా థర్డ్ అంపైర్ కి అప్పజెప్పింది .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube