తెలంగాణలో టికెట్ల కేటాయింపుల వ్యవహారం ఇంకా ముగియలేదని ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్ అన్నారు.అసెంబ్లీ టికెట్ల కేటాయింపుపై అభ్యంతరాలు ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడాలని తెలిపారు.
ఈ వ్యవహారంలో ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయని మన్సూర్ అలీఖాన్ పేర్కొన్నారు.పార్టీకి, నాయకులకు వ్యతిరేకంగా బహిరంగంగా ఎవరూ మాట్లాడొద్దని సూచించారు.
కొందరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారన్న ఆయన ఇకపై అలాంటి పనులు మానుకోవాలని తెలిపారు.కాగా తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే 55 నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మిగిలిన 64 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తుంది.







