బ్యాంకు లావాదేవీల్లో కీలక మార్పులు... ఏమిటంటే..!?

కొంత మంది సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ మధ్య కాలంలో చాలామంది ప్రజల దగ్గర నుండి డబ్బును దోచేసుకునే క్రమంలో ఫేక్ మెసేజ్స్  పంపుతూ ఉంటారు.ఆ మెసేజ్లు నిజమో కాదో అని తెలియకుండా కొంతమంది సైబర్ నేరగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటూకొన్నారు.

 Key Changes In Bank Transactions What Is  Bank Transctions, Trai, Otp, Sms , Ban-TeluguStop.com

మరోవైపు బ్యాంకుల నుంచి వచ్చిన ఓటీపీ కానీ, సంబంధిత వివరాలు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా  ఎవరికీ చెప్పవద్దు అలాగే షేర్ చేయవద్దని ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కొంతమంది మాత్రం సైబర్ కేటుగాళ్ల చేతులలో  బలి అయిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న ఫార్మెట్ లో ఓటిపి, బ్యాంకు  సంబంధిత మెసేజ్లను పంపడం వల్ల సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచుకునేందుకు మంచి అవకాశం ఉందని ఈ సమస్య నుంచి బయటపడేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్త ఫార్మెట్ ను  ప్రవేశపెట్టండి.

ఆ ఫార్మేట్ ద్వారా నకిలీ, తప్పుడు SMS లు బ్యాంకుల పేర్లతో సంబంధిత వినియోగదారులకు వెళ్లే అవకాశం ఉండదని, ఈ సరికొత్త ఫార్మెట్ ను బ్యాంకులు అన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలని గత నాలుగు బ్యాంకులకు హెచ్చరిస్తూనే ఉంది.అయినా కూడా కొన్ని బ్యాంకులు ఎప్పటికప్పుడు దానిని వాయిదా వేస్తూనే ఉన్నారు.

ఇలా ఉండగా గత ఏడాది ఫిబ్రవరి నెలలోనే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటేనే మెసేజ్స్ పంపిస్తామని స్పష్టంగా తెలియచేసినప్పటికీ 24 గంటల పాటు ఓటిపి సందేశాలను కూడా నిలిపివేసింది.బ్యాంకులు మరింత గడువు కోరడంతో ట్రాయ్ ఒప్పుకుంది.

ఇది ఇలా ఉండగా ఏప్రిల్ 1 తేదీ నాటికి కచ్చితంగా బ్యాంకులు తమ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని లేకపోతే ఖచ్చితంగా ఓటీపీలు, SMSలు ఆపేస్తామని ట్రాయ్ హెచ్చరించంది.దీంతో ఇప్పటికే బ్యాంకులు వారి చెల్లింపు విధానాలను అప్డేట్ చేసుకోకపోతే సంబంధిత వినియోగదారులు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంది.

ఇక మరోవైపు సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఆటోమేటిక్ గా జరిపే చెల్లింపుల విధానంలోమార్పులు చేపట్టి, ప్రతి నెల చెల్లింపులు జరిపే ఇంటి రుణం వాయిదా నుంచి టెలిఫోన్ బిల్లు వరకు బ్యాంకు ఖాతా నుండి ఆటోమేటిక్ గా చెల్లింపులు జరిపే లాగా అప్డేట్ తీసుకొని వచ్చింది.

మునుపటిలాగా వేటికి పడితే వాటికి ఆటోమేటిక్ గా చెల్లింపులు జరగకుండా కొన్ని సేవలకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తుంది.ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటి సేవలకు, డిటిహెచ్ , ఫోన్ బిల్స్ సేవలకు ఆటోమేటిక్ గా చెల్లింపులు జరగకుండా తగిన ఏర్పాట్లు చేసింది ట్రాయ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube